జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ :బెస్ట్ డబల్ డేటా అఫర్స్

Updated on 17-May-2020
HIGHLIGHTS

వినియోగదారులకు సరైన ప్రయోజనాలతో మంచి ప్లాన్స్ ఇవ్వడానికి అన్ని టెలికం సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

తమ వినియోగదారులకు సరైన ప్రయోజనాలతో మంచి ప్లాన్స్ ఇవ్వడానికి అన్ని టెలికం సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే, కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నుండి  ఊరటగా ఆన్లైన్ గేమ్స్, మూవీస్ మరియు షోలతో కొంత సమయం ఆహ్లాదంగా గడపటానికి సహాయపడేలా లేదా వారు చేస్తున్న work from home కోసం ఉపయోగపడేలా  తమ యూజర్ల కోసం కొత్త జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికం సంస్థలు డబుల్ డేటా ఆఫర్లను ప్రకటించాయి. అయితే, jio తన యూజర్ల కోసం డేటా , కాలింగ్ మరియు SMS బెనిఫిట్స్ తో పాటుగా, ఎంటర్టైన్మెంట్ ని కూడా ఇస్తోంది. అందుకోసమే ఈ మూడు ప్రధాన సంస్థల చేస్తున్న డబుల్ డేటా ఆఫర్లల్లో బెస్ట్ Offersచూద్దాం. 

ఎయిర్టెల్ రూ.98 డబుల్ డేటా ప్యాక్ 

ఎయిర్టెల్ ఇప్పుడు తన రూ .98 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ నుండి  ఈ డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్యాక్ ఇప్పుడు 6GB డేటాకు బదులుగా 12GB డేటాతో వస్తుంది. ఎయిర్‌టెల్ 98 ప్రీపెయిడ్ చెల్లుబాటు 28 రోజులు మరియు ఇది డేటా ప్యాక్ అయినందున ఈ ప్లాన్  ఎటువంటి కాల్ లేదా SMS ప్రయోజనాలను అందించదు.

జియో రూ .101 యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో రూ .101 యాడ్-ఆన్ ప్యాక్ ద్వారా వినియోగదారులకు 12 జీబీ హై స్పీడ్ డేటా మరియు 1000 నిమిషాల నాన్ జియో కాలింగ్ ఇస్తుంది. అయితే, ఈ రూ. 101 రూపాయల ప్యాక్ కేవలం యాడ్-ఆన్ ప్యాక్  మాత్రమే అని గమనించాలి. ఎందుకంటే, యూజర్లు  ఇప్పటికే  వాడుతున్న ప్లాన్ ముగిసే వరకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటుందని గమనించాలి.

వోడాఫోన్ రూ .98 డేటా యాడ్-ఆన్

ఇక వోడాఫోన్ యొక్క రూ .98 డేటా యాడ్-ఆన్ ప్యాక్ తన వినియోగదారులకు 6GB హై-స్పీడ్ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఈ ప్లానుతో మీకు ఎటువంటి కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ కానీ అందించబడవు. 

for More Offers (CLICK) here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :