Jio vs Airtel: రెండు టెలికాం కంపెనీలు అందించిన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే.!

Jio vs Airtel : టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు జియో మరియు ఎయిర్టెల్ రెండు టెలికాం కంపెనీలు కూడా కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించాయి. కేవలం వాయిస్ మరియు SMS ప్రయోజనాలు మాత్రమే ఆఫర్ చేసేలా చవక ప్రీపెయిడ్ ప్లాన్ లను యూజర్స్ కోసం అందించాలనే, ట్రాయ్ ఆదేశాలతో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించాయి.
Jio vs Airtel:
జియో మరియు ఎయిర్టెల్ రెండు టెలికాం కంపెనీలు కూడా రెండేసి కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను విడుదల చేశాయి. ఈ రెండు మేజర్ కంపెనీలు కూడా వన్ ఇయర్ మరియు మూడు నెలల దీర్ఘకాలిక వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ లను యూజర్ల కోసం అందించాయి.
జియో వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్
రిలయన్స్ జియో రూ. 1,958 మరియు 458 రూపాయల వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లు లాంచ్ చేసింది. వీటిలో రూ. 1,958 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ అందించే, రూ. 458 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేస్తుంది.
ఈ రెండు ప్లాన్స్ కూడా పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తాయి. అయితే, SMS ప్రయోజనంలో మార్పులు ఉంటాయి. రూ. 1,958 ప్లాన్ 3600 SMS లను ఆఫర్ చేస్తే, రూ. 458 ప్లాన్ 1000 SMS లను తీసుకువస్తుంది. అలాగే, జియో క్లౌడ్, జియో టీవీ మరియు జియో సినిమా యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా తీసుకు వస్తాయి.
ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్
ఇక ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఎయిర్టెల్ కూడా రూ. 1,959 మరియు రూ. 499 రూపాయల రెండు ప్లాన్స్ అందించింది. వీటిలో, రూ. 1,959 ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రూ. 499 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది.
ఎయిర్టెల్ యొక్క ఈ లేటెస్ట్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తాయి. అయితే, రూ. 1,959 ప్లాన్ 3600 SMS లను చేస్తుంది మరియు రూ. 499 రూపాయల ప్లాన్ 900 SMS లను ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా మూడు నెలల ఉచిత Apollo 24|7 మెంబర్ షిప్ మరియు ఉచిత హలో ట్యూన్స్ సౌకర్యాన్ని కూడా ఈ రెండు ప్లాన్స్ ఆఫర్ చేస్తాయి.
Also Read: లేటెస్ట్ LG 3.1.3 Soundbar పై అతి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here