జియో యూజర్లు VoWi-fi సేవలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ టెక్ భారతదేశంలో వాయిస్ కాలింగ్ యొక్క భవిష్యత్తు కావచ్చు.
గత కొన్ని నెలలుగా భారతదేశంలోని ప్రధాన టెలికం కంపెనీల మధ్య జరుగుతున్నా ప్లాన్స్ యుద్ధం నిజంగా వేడెక్కుతోంది. పునరుద్ధరించిన ప్రణాళికల నుండి అందించే సేవల వరకు, భారతదేశంలోని మూడు ప్రధాన టెలికం సంస్థల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం, ఎయిర్టెల్ ఢిల్లీ NCR ప్రాంతంలో ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ అని పిలిచే VoWi-fi సేవను ప్రారంభించింది మరియు రాబోయే నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తెచ్చే ప్రణాళికతో ప్రారంభించిందని మేము ముందుగా నివేదించాము.
ఇది జరిగిన వెంటనే, రిలయన్స్ జియో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో వారి VoWi-fi సర్వీస్ యొక్క వెర్షన్ను విడుదల చేసింది. టెలికామ్‌టాక్ లోని ఒక నివేదిక ప్రకారం, ట్విట్టర్ వినియోగదారు ఈ సేవ యొక్క స్క్రీన్ షాట్ లను షేర్ చేశారు . అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం వుంది , ఈ స్క్రీన్షాట్లు ఆపిల్ డివైజ్ నుండి తీసుకోబడ్డాయి. దీని అర్థం ఏమిటంటే, ఈ సేవతో రిలయన్స్ ఎయిర్టెల్ కు పోటీగా నిలచింది. ఈ సేవ రిలయన్స్ జియో నెట్ వర్క్ లలో మాత్రమే పనిచేయగలదని మేము భావిస్తున్నాము.
రిలయన్స్ ఏ ఫోన్లకు ఈ సేవ అనుకూలంగా ఉంటుందో, అతృవంటి ఫోన్ల జాబితాను విడుదల చేయలేదు కాని రాబోయే నెలల్లో ఒక ప్రకటన లేదా రెండింటిని మనం శించవచ్చు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఈ సేవ అందుబాటులోకి రాకముందే కంపెనీ అన్ని కింక్ మరియు బగ్స్ తొలగించడానికి ఒక చిన్న ప్రాంతంలో సేవలను పరీక్షిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఈ టెక్ భారతదేశంలో వాయిస్ కాలింగ్ యొక్క భవిష్యత్తు కావచ్చు.