జియో వినియోగదారులకు ఇంక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది
తాజా ఆఫర్లుగా జాబితా చేయనుంది
ఇప్పటికే, ప్రధాన టెలికం సంస్థలైనటువంటి భారతీ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా తమ కొత్త టారిఫ్ ధరలను అమలుచేయగా, జియో మాత్రం డిసెంబర్ 6 వతేదికి తమ కొత్త టారిఫ్ ధరలను ప్రకటించనున్నట్లుగా తెలియచేసింది. అయితే, ఇప్పటికే ఒక కొత్త రూ.1744 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం ప్రకటించింది. కానీ, ఇందులో పెద్ద చెప్పుకోదగిన మార్పులైతే ఏమీలేవు రూ.444 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 4 రేట్లు మాత్రమే ఉంటుంది. అంటే, ఇది 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
అయితే, ముందుగా జియో త్యమా కొత్త టారిఫ్ ల గురించి తెలిపిన విషయం ఏమిటంటే, రిలయన్స్ జియో పూర్తిగా కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ లేదా AIO ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది, ఇది 40% టారిఫ్ పెంపుతో వస్తుంది. డేటా, ఎస్ఎంఎస్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో అపరిమిత కాలింగ్ మరియు కొన్ని IUC నిమిషాల వంటి, అన్నిప్రయోజనాలతో కూడిన రిలయన్స్ జియో యొక్క ఆల్ ఇన్ వన్ ప్లాన్లను, తాజా ఆఫర్లుగా జాబితా చేయనుంది అని చెబుతోంది.
ఈ ప్లాన్లతో, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఈ కొత్త ప్రకటన అంటే రిలయన్స్ జియో రూపొందించిన ఈ AIO ప్లాన్ల ధరలు మాత్రం 40% పెరుగుతాయి మరియు అందువల్ల వినియోగదారులు రాబోయే రోజుల్లో వాటి కోసం ఎక్కువ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా చూస్తే, ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చెయ్యడానికి జియో వినియోగదారులకు ఇంకా సహతిలో రెండు రోజుల సమయం మాత్రమే వుంది.