Jio Tv+ లో ఇప్పుడు కొత్త ఫీచర్ ఒకదానిని జత చేసింది. ఈ కొత్త ఫీచర్ తో జియో టీవీ ప్లస్ ద్వారా ప్లే అయ్యే కంటెంట్ లో అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా ఆ సీన్ బ్లర్ అవుతుంది. ప్రస్తుతం OTT ప్లాట్ ఫామ్ లలో ప్రసారమవుతున్న సిరీస్ లు మరియు కొత్త సినిమా లో పెరుగుతున్న అశ్లీల సీన్స్ మరియు డైలాగులు నుంచి ఈ కొత్త ఫీచర్ ఫ్యామిలీ టీవీ చూస్తున్న సమయంలో రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా సీన్స్ ను బ్లర్ చేయడానికి AI Sensor ను ఉపయోగిస్తుంది.
జియో టీవీ ప్లస్ లో కొత్తగా జత చేర్చిన ఈ కొత్త AI Sensor ఫీచర్ రియల్ టైం లో పని చేస్తుందని జియో తెలిపింది. అయితే, ఇది జియో టీవీ ప్లస్ సర్వీస్ లు కలిగిన స్మార్ట్ టీవీ లలో మాత్రమే పని చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రసారమవుతున్న వీడియో లేదా కంటెంట్ లో ఏదైనా అశ్లీల సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ సీన్ ను బ్లర్ చేస్తుంది.
ఈ కొత్త AI sensor ఫీచర్ కేవలం వీడియోలు మాత్రమే కాదు ఆడియో ను కూడా మ్యూట్ చేస్తుంది. అంటే, కంటెంట్ లో ఏదైనా జుగుప్స కలిగించే డైలాగులు వచ్చినప్పుడు ఆటోమాటిగ్గా సౌండ్ మ్యూట్ చేస్తుంది. ఈ అంత పనిని కూడా AI సహాయంతో రెప్పపాటు కాలంలో చేసేస్తుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇంటిల్లపాది ఎటువంటి ఆటకం లేకుండా టీవీ కార్యక్రమాలు లేదా ఆన్లైన్ కంటెంట్ ఆస్వాదించడానికి సహాయం చేస్తుందని జియో తెలిపింది. ఈ చర్య ద్వారా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూసే సమయంలో అనుకోకుండా వచ్చే అశ్లీల సీన్స్ కు అడ్డుకట్ట వేసే వీలుంటుంది.
Also Read: Flipkart Sale చివరి రోజు సగం ధరకే లభిస్తున్న Samsung ప్రీమియం ఫోన్.!
అయితే, ఈ సర్వీస్ అందరికి అందుబాటులో ఉండదు. కేవలం జియో ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ తో రీచార్జ్ చేసే జియో టీవీ ప్లస్ యూజర్లకు మాత్రమే అందుతుంది.
for jio recharge plans Click Here