నిన్న AGM నుండి జియో ప్రకటించిన JIO Tv + ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఏంటి లాభం?

Updated on 16-Jul-2020
HIGHLIGHTS

నిన్న జరిగిన RIL AGM 2020 నుండి చాలా ప్రతిపాదనలు మరియు కొత్త ఇన్వెస్ట్ మెంట్స్ గురించి ప్రకటించింది.

ముఖ్యంగా, Reliance Jio 5G మరియు Jio Google Deal మరియు Jio Tv + వంటి ప్రతిపాదనలు చేసింది.

JIO Tv + మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుండి కంటెంట్ ని నేరుగా మీ టీవీకి అంధిస్తుంది మరియు వాయిస్ సెర్చ్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది.

నిన్న జరిగిన RIL AGM 2020, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతి సంవత్సరం నిర్వహించే యాన్యువల్ జనరల్ మీటింగ్ 2020 నుండి చాలా ప్రతిపాదనలు మరియు కొత్త ఇన్వెస్ట్ మెంట్స్ గురించి ప్రకటించింది. వాటిలో ముఖ్యంగా, Reliance Jio 5G మరియు Jio Google Deal మరియు Jio Tv + వంటి ప్రతిపాదనలు  ఉన్నాయి. Reliance Jio 5G ని ఇండియాలో త్వరలో తీసుకురావడానికి తమవంతు కృషిని చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక Jio Google Deal విషయానికి వస్తే, ఈ ఒప్పందంతో జియో ప్లాట్ఫామ్స్ పైన 7.7 వాటాని సొంతం చేసుకోవడానికి 33,737 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుంది.

JIO Tv + ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుత ఆన్లైన్ యుగంలో అన్ని చానళ్లను మరియు వినోదాలను అందుకోవడానికి ప్రజలు ఎక్కువగా OTT (Over-The-Top) పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు మరియు ఇష్టపడుతున్నారు. OTT (Over-The-Top) అంటే, ఎటువంటి ఇతర పరికరం అవసరం లేకుండా ఇంటర్నెట్ ద్వారా సినిమా, షో మరియు టీవీ కార్యక్రమాలను అందించే వేదిక. JIO Tv + కూడా అదే పనిచేస్తుంది మరియు మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుండి కంటెంట్ ని నేరుగా మీ టీవీకి అంధిస్తుంది మరియు వాయిస్ సెర్చ్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది.    

JIO Tv + వలన ఏంటి లాభం?

ఇక Jio Tv + గురించి చూస్తే, ఇప్పటి వరకూ అని సెటప్ బాక్స్ లు కూడా కేవలం కొని OTT ఫామ్స్ ని మాత్రమే అందిస్తుండగా, Jio Tv + మాత్రం ప్రస్తుత ఆన్లైన్ల్ ప్రధానమైన OTT ప్లాట్ఫామ్స్ అయిన , Netflix, Prime Video , Disney +Hotstar , Voot , Sony Liv , Zee 5 , Lionsgate Play , JioCinema , Shemaroo, Jio Savan , Youtube, మరియు Eros Now  వంటి  12 OTT ప్లాట్ఫామ్స్ ని అందిస్తుంది.కేవలం ఇదోక్కటే కాదు , ఈ అన్ని ప్లాట్ఫామ్స్ ని విడివిడిగా లాంగిన్ చెయ్యాల్సిన అవసరం కూడా లేకుండా, కేవలం ఒకేఒక్క లాగిన్ ద్వారా ఈ అన్ని OTT ప్లాట్ఫామ్స్ కి లాగిన్ అయ్యేలా కూడా అవకాశాన్ని అందించింది.    

అన్ని యాప్స్ కి కొడా విడివిడిగా లాగిన్ చేయాల్సివుంటుంది. కానీ, జియో కొత్తగా ప్రకటించిన ఈ  Jio Tv + మాత్రం కేవలం ఒక్క లాగిన్ తో అన్ని యాప్స్ ని నిర్వహించేలా వుంటుందని, జియో అధినేత అంబానీ,  AGM నుండి లాంచ్ సమయంలో తెలిపారు.                                      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :