Jio 5G: తెలుగు రాష్ట్రాల్లోని మరో నాలుగు నగరాల్లో మొదలైన 5G నెట్ వర్క్.!

Updated on 18-Jan-2023
HIGHLIGHTS

దేశంలో శరవేగంగా తన 5G సర్వీస్ లను విస్తరిస్తున్న రిలయన్స్ జియో

దేశవ్యాప్తంగా మరో 16 నగరాల్లో తన Jio True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది

ఈ 16 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి

దేశంలో శరవేగంగా తన 5G సర్వీస్ లను విస్తరిస్తున్న రిలయన్స్ జియో, దేశవ్యాప్తంగా మరో 16 నగరాల్లో తన Jio True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది. ఈ 16 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 నగరాల్లో జియో 5G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు ప్రకటించిన ఈ 4 నగరాలతో కలిపి మొత్తంగా 13 నగరాల్లో Jio True 5G సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. 

రిలయన్స్ జియో నిన్న దేశవ్యాప్తంగా 16 నగరాల్లో జియో 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. వీటిలో,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, కర్నూల్ నగరాలలో మరియు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఖమ్మం నగరాలలో జియో తన 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. అంటే,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 8 నగరాలలో మరియు తెలంగాణ రాష్ట్రంలోని 5 నగరాలలో Jio True 5G సర్వీస్ లు అందుబాటులోకి తీసుకువచ్చింది.      

రిలయన్స్ జియో తెలుగురాష్ట్రాలలో ముందుగా హైదరాబాద్ లో తన 5G నెట్ వర్క్ ను విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబర్ లోనే హైదరాబాద్ నగరంలో జియో 5జి నెట్ వర్క్ ను లంచ్ చేసింది. తరువాత, డిసెంబర్ 2021 చివరికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, తిరుమల మరియు విశాఖపట్నం నాలుగు నగరాలలో Jio True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది. అంటే, 2022 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలలో మొత్తం 5 నగరాలలో జియో 5జి నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఇక 2023 ప్రారంభమవుతూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు మరియు తిరుపతి సిటీలలో జియో 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. తరువాత, తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ మరియు కరీంనగర్ రెండు నగరాలలో జియో 5జి నెట్ వర్క్ ను ప్రారంభించింది. అంటే, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 నగరాల్లో జియో 5G నెట్ వర్క్ అందుబాటులో తీసుకువచ్చింది. ఇప్పుడు, లిస్ట్ లో మరో నాలుగు తెలుగు రాష్ట్రాల నగరాలను జత చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :