Jio True 5G ఆధారిత Wi-Fi సర్వీస్ ప్రారంభించిన జియో..!!

Jio True 5G ఆధారిత Wi-Fi సర్వీస్ ప్రారంభించిన జియో..!!
HIGHLIGHTS

ఆకాష్ అంబానీ Jio True 5G పవర్డ్ WiFi సర్వీస్ లను ప్రారంభించారు

Jio True 5G పవర్డ్ WiFi సర్వీస్ లను ఎటువంటి ఛార్జీలు లేకుండా అందించారు

రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా టెంపుల్ నుండి సర్వీస్ లను ప్రారంభించారు

2022 దసరా పండుగ సందర్భంగా Jio తన 5G సర్వీస్ లను లాంఛన ప్రాయంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసి లలో ప్రారంభించింది. కేవలం లాంచ్ చెయ్యడమేకాదు, బీటా ట్రయల్స్ సమయంలో వినియోగదారులకు 1Gbps వేగాన్ని అందించినట్లు కూడా కంపెనీ పేర్కొంది. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి, Jio True 5G ఆధారిత Wi-Fi సర్వీస్ లను అందుబాటులోకి కూడా జియో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ వారం ప్రారంభంలో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా టెంపుల్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఆకాష్ అంబానీ ఈ Jio True 5G పవర్డ్ WiFi సర్వీస్ లను ప్రారంభించారు. ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ Jio True 5G పవర్డ్ WiFi సర్వీస్ లను ఎటువంటి ఛార్జీలు లేకుండా అందించారు.

ఈ అతిపెద్ద టెలికం కంపెనీ, ఇండియాలో ఈ సర్వీస్ లను విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలు మరియు మరిన్ని రద్దీ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రకటించింది. అంతేకాదు, Jio వెల్‌కమ్ ఆఫర్‌ తో తాజాగా చెన్నై నగరాన్ని కూడా జోడించింది మరియు త్వరలోనే మరిన్ని నగరాలను దీని పరిధిలోకి తీసుకువస్తుందని జియో తెలిపింది.

పవిత్ర పట్టణం నాథ్‌ద్వారా లో కొలువున్న లార్డ్ శ్రీనాథ్ జీ ఆలయంలో మొదటి True 5G -ఎనేబుల్డ్ Wi-Fi సేవను అందించాము. ఈ సర్వీస్ లను మేము అనేక పట్టణాలకు కూడా విస్తరిస్తాము. తద్వారా అనేక ప్రాంతాలకు ఈ సేవలను అందించ గలుగుతాము. అని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo