మంచి డౌన్లోడ్ స్పీడ్ మనకు వీడియోలను చూడడానికి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, మెయిల్స్, ఆన్లైలో సాంగ్స్ వినడానికి మరియు చాలావాటికి ఎటువంటి ఆంతరాయాన్ని కలిగించకుండా ఉండేలా ఉంటుంది. ఇక అప్లోడ్ వేగం ఎక్కువగా వలన, మెయిల్స్ పంపడం, ఇమేజిలను పంపడం మరియు మీ యొక్క వీడియోలను షేర్ చేసుకోవడాన్నీ సులభతరం చేస్తుంది. అటువంటి అప్లోడ్ మరియు డౌన్లోడ్ 4G స్పీడ్స్ ఏయే కంపెనీలు ఎలా ఇస్తున్నాయి TRAI తెలుపుతుంది.
ET టెలికం ప్రకారం, నవంబరు నెలకోసం టెలికాం రెగ్యులేటర్ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన 4G డౌన్లోడ్ స్పీడ్ చార్టులో జియో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇది 20.3 Mbps సగటు డౌన్లోడింగ్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, అక్టోబరు నెలలో చూపిన 22.3 Mbps సగటు డౌన్లోడింగ్ వేగంతో పోలిస్తే, ఇది కొంత తక్కువగా ఉంటుంది. ఐడియా మరియు వోడాఫోన్ రెండూ కలిసిపోయినప్పటికీ కూడా ఈ రెండింటిని విడివిడిగా చూపింది TRAI.
ఐడియా విషయానికివస్తే, 6.2 Mbps సగటు 4G డౌన్లోడ్ స్పీడుతో వెనుకబడివున్నా, 5.6 Mbps 4G అప్లోడ్ స్పీడుతో ఈ విభాగంలో ముందంజలోవుంది. అయితే, ఐడియా అక్టోబరు నెలలో చూపిన 5.9 Mbps 4G డౌన్లోడింగ్ స్పీడుతో పోలిస్తే ఇది కూడా కొంచెం తగ్గుముఖమే పట్టింది. 4G డౌన్లోడ్ స్పీడ్ లో వోడాఫోన్, నవంబరు నెలలో కొంత పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అక్టోబరులో వోడాఫోన్ 6.6 Mbps డౌన్లోడ్ వేగంతో పోలిస్తే, నవంబరులో 6.8 Mbps 4G డౌన్లోడ్ వేగాన్ని కనబరిచింది.
భారతీ ఎయిర్టెల్, అక్టోబరులో నెలలో చూపిన సగటు వేగం 9.5 Mbps కంటే కొంచెం పుంజుకొని 9.7 Mbps డౌన్లోడింగ్ వేగంతో కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది.