Jio Super Offer: కేవలం రూ. 100 కే డేటా మరియు జియో హాట్ స్టార్ 3 నెలల సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!

జియో యూజర్లకు మంచి బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి
IPL 2025 సీజన్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ తో వచ్చే ప్లాన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి
రూ. 100 రూపాయల ఖర్చుతోనే మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్ ఒక్కటే వుంది
Jio Super Offer: రిలయన్స్ జియో యూజర్లకు మంచి బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. అయితే, IPL 2025 సీజన్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ తో వచ్చే ప్లాన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో కేవలం రూ. 100 రూపాయల ఖర్చుతోనే మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్ ఒక్కటే వుంది. ఈ ప్లాన్ కావడానికి డేటా ప్లాన్ అయినా కూడా మంచి బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు, బడ్జెట్ ధరలో వచ్చే మరో బడ్జెట్ ప్లాన్ కూడా మంచి బెనిఫిట్స్ అందిస్తుంది. జియో ఆఫర్ చేస్తున్న ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.
Jio Super Offer: ఏమిటా ఆఫర్?
రిలయన్స్ జియో యొక్క రూ. 100 డేటా ప్యాక్ ను జియో సూపర్ ఆఫర్ గా చెబుతారు. ఎందుకంటే, ఈ ప్లాన్ కేవలం 100 రూపాయల ధరలో 5GB డేటా మరియు 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అంతేకాదు, ఈ జియో డేటా ప్లాన్ తో జియో హాట్ స్టార్ 90 రోజుల మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు IPL 2025 సీజన్ మొత్తం మొబైల్ ఫోన్ లో ఎంజాయ్ చేయవచ్చు.
ఇలాంటి లాభాలు రెండవ బడ్జెట్ ప్లాన్ ఏమిటి?
రిలయన్స్ జియో యొక్క రూ. 195 రూపాయల డేటా ప్లాన్ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ డేటా ప్లాన్ కూడా 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ బడ్జెట్ డేటా ప్లాన్ తో 15GB డేటా కూడా అందిస్తుంది. డిడ్ మాత్రమే కాదు ఈ జియో బెస్ట్ బడ్జెట్ డేటా ప్లాన్ తో 90 రోజుల జియో హాట్ స్టార్ 90 రోజుల మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా IPL 2025 సీజన్ మొత్తం యూజర్లు మొబైల్ ఫోను లో ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: X Down: GibiliStyle హ్యాష్ ట్యాగ్ మరియు ట్రెండ్ దెబ్బకి డౌన్ అయిన ఎలాన్ మస్క్ X ప్లాట్ ఫామ్.!
అయితే, ఈ రెండు ప్లాన్స్ ఏదైనా ఒక బేస్ ప్లాన్ తో యాడ్ ఆన్ గా మాత్రమే ఉపయోగపడతాయి. ఒక వేళ బేస్ ప్లాన్ ఎంచుకోక పోతే ఈ ప్లాన్స్ చెల్లుబాటు కావు అని గుర్తుంచుకోండి.