ఎయిర్టెల్ మరియు Vi కి మరొక సారి జియో షాక్
ఎయిర్టెల్ మరియు Vi కి మరొక సారి జియో షాక్
జియో కస్టమర్ల కోసం మరొక చవక ప్రీపెయిడ్ ప్లాన్
అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ డేటా
ఎయిర్టెల్ మరియు Vi కి మరొక సారి జియో షాక్ ఇచ్చింది. జియో కస్టమర్ల కోసం మరొక చవక ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఇది ముందుగా Reliance Jio కస్టమర్లకు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్. అయితే, దీన్ని కొన్నాళ్లుగా పక్కన పెట్టింది. కానీ, ఇప్పుడు దీన్ని తన వినియోగదారుల కోసం మళ్ళి యాక్టివ్ చేసింది. అదే, రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ రూ. 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ డేటా లిమిట్ వంటి మంచి లాభాలను ఇస్తుంది.
Jio రూ. 98 ప్లాన్ ప్రయోజనాలు
ఈ Jio రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్ తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్ ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు.
ఇక ఇటీవల ప్రకటించిన కొత్త రూ.39 మరియు రూ.39 ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.
ఇక రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 512MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది.