Jio Plan Revise: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రేటు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్ కూడా భారం అయ్యి కూర్చున్నాయి. అయితే, వీటిలో కొన్ని ప్లాన్ లను కస్టమర్లకు ప్రియమైనవిగా మార్చడానికి జియో ప్రయత్నం చేస్తోంది, ఇందులో భాగంగా ఇటీవల రూ. 999 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చిన జియో, ఇప్పుడు రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా రివైజ్ చేసింది.
రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 349 ను రివైజ్ చేసింది. ఈ ప్లాన్ రేటు లేదా ప్రయోజనాలలో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, ఈ ప్లాన్ ను నెలవారీ ప్లాన్ గా మార్చేసింది. అంటే, ఇప్పటి వరకు 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందించిన జియో, ఈ ప్లాన్ పైన ఇప్పుడు నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అంతేకాదు, ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ ను Jio Hero 5G గా కూడా నామకరణం చేసింది.
రిలయన్స్ జియో హీరో 5జి ప్రీపెయిడ్ ప్లాన్ లేదా రూ. 349 ప్లాన్ ఇప్పుడు 1 నెల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ 1 నెల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB డేటా చొప్పున నెల రోజులు డేటా అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో డైలీ 100 SMS ల ఉపయోగ ప్రయోజనం కూడా అందుతుంది., ఈ ప్లాన్ తో జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
అయితే, వాస్తవానికి ఈ ప్లాన్ గతంలో రూ. 299 రూపాయల రేటుకే లభించేది. అయితే, ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ అందించేది.
అంతా బాగానే ఉంది కానీ ఈ ఆఫర్ జియో వెబ్సైట్ లేదా My Jio యాప్ పైన దర్శనం ఇవ్వడం లేదు. ఎందుకంటే, ఈ జియో హీరో 5జి ప్లాన్ కేవలం 28 రోజుల వ్యాలిడిటీ తో మాత్రమే కన్పిస్తోంది. అయితే, రిలయన్స్ జియో అధికారిక X అకౌంట్ (ట్విట్టర్) నుండి అందించిన ట్వీట్ ద్వారా ఈ కొత్త అప్డేట్ వివరాలు వెల్లడించింది.
Also Read: WhatsAppలో బ్యాక్ గ్రౌండ్ కు కొత్త సొబగులు అందించే కొత్త ఫీచర్ వస్తోంది.!
ఇక జియో రీసెంట్ గా అందించిన రూ. 999 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా, 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
మొబైల్ నెంబర్ రీచార్జ్ లేదా బెస్ట్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here