JIO యొక్క Rs.149 ప్రీపెయిడ్ ప్లానులో పెను మార్పులు

JIO యొక్క Rs.149 ప్రీపెయిడ్ ప్లానులో పెను మార్పులు
HIGHLIGHTS

కొత్త ALL - IN - ONE ప్లాన్లతో వినియోగదారులకు సరైన మార్గాన్ని చూపేందుకు ప్రయత్నించింది.

సంచలనాలకు మూలకేంధ్రమైన రిలయన్స్ జియో, ముందుగా అన్ని ఉచితంగా అందించిన విషయం మనందరికీ తెలుసు. అయితే, TRAI నిబంధనల ప్రకారం ఇతర నెట్వర్కులకు చేసే కాల్స్ కి నిముషానికి 6 పైసలు వసూలు చెయ్యడం మొదలు పెట్టింది. ఇక్కడే, జియో సర్వత్రా ఇబ్బందులకు లోనవుతుంది. ముందుగా, కొత్త ALL – IN – ONE ప్లాన్లతో వినియోగదారులకు సరైన మార్గాన్ని చూపేందుకు ప్రయత్నించింది.

అయితే, అందరికి సుపరిచితమైన మరియు ఎక్కువగా రీచార్జ్ చేసే రూ.149 రూపాయల నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ను, ఇప్పుడు ఈ ALL – IN – ONE  ప్లాన్ల గ్రూప్ లోకి తీసుకొచ్చింది. ముందుగా, ఈ ప్లానుతో ఎటువంటి నెట్వర్కుకైనా అన్లిమిటెడ్ కాలింగ్, రోమింగ్, డైలీ 1.4 GB హై స్పీడ్ 4G డాటాతో పాటుగా రోజుకు 100 SMS లు కూడా దొరికేవి, అదికూడా పూర్తి 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. ఒక వినియోగదారుడికి కావాల్సిన అన్ని ప్రయోజాలను ఈ ప్లానుతో జియో అందించింది.

ప్రస్తుతం, ఈ రూ.149 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేస్తే జియో నుండి జియో నెట్వర్కుకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర నెట్వర్క్ లకు కూడా కాలింగ్ చేసుకోవడానికి 300 నిముషాల టాక్ టైం అందిస్తుంది. అంతేకాదు, డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డాటాతో పాటుగా రోజుకు 100 SMS లు కూడా లభిస్తాయి. వాస్తవానికి, ఇక్కడి వరకూ ఈ ప్లాన్ను అన్నివిధాలా సరైనదిగా అందించింది. కానీ, దీని వ్యాలిడిటీ ని మాత్రం 24 రోజులకు పరిమితం చేసింది. అంటే, ముందస్తు ప్లాన్ కన్నా 4 రోజుల తక్కువ వ్యాలిడిటీ తో ఈ ప్లాన్ను అందిస్తోంది. కానీ, పెంచిన డేటా మరియు 300 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం కొంచం పర్వాలేదనిపిస్తుంది.                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo