జియో కొత్త టార్గెట్ : తక్కువ ధరకే 7.5 కోట్ల మందికి FTTH సేవలను అందించనుంది
1,600 ప్రధాన పట్టణాల్లో ఈ సర్వీసులను అతిత్వరగా పూర్తి చేయడనికి సిద్ధమవుతోంది.
టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే, ఉచిత సేవలతో అందరిని ఆశ్చర్యపరచిన విష్యం తెలిసిందే. అలాగే, తక్కువ ధరలో తన 4G సేవలను అందిస్తుండగా మిగిలిన సంస్థలు కూడా మార్కెట్ లోని పోటీని తట్టుకుని నిలబడేందుకు వాటి ధరలలో అనేక మార్పులను కూడా చేయాల్సి వచ్చింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అతితక్కువ ధరకే 4G మొబైల్ డేటా అందిస్తున్న ఏకైక సంస్థగా జియోనే మొదటి స్థానాన్ని అందుకుంది.
అటువంటి గొప్ప సర్వీసును చాల తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్న జియో బ్రాండ్ బ్యాండ్ సేవలను కూడా అటువంటి ఉన్నతమైన ప్రణాళికలతో తీసుకొచ్చింది. గత సంవత్సరం, 5 కోట్ల మందికి తక్కువ ధరకే FTTH సేవలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జియో సంస్థ ఇప్పుడు తన వ్యూహాలను మరింతగా పెంచింది. ఇప్పుడు, తక్కువ ధరకే 7.5 కోట్ల మందికి FTTH సేవలను అందించడానికి నిర్ణయించింది. ముందుగా, ప్రకటించింది 1,600 ప్రధాన పట్టణాల్లో ఈ సర్వీసులను అతిత్వరగా పూర్తి చేయడనికి సిద్ధమవుతోంది.
ముందుగా 4,500 రూపాయల డిపాజిట్ తో ఈ సేవలను అందించనున్నట్లు ప్రకటించినా, ఈ సర్వీసులను చౌక ధరకే అందరికి అందుబాటులోకి తేవడానికి దాన్ని 2,500 ధరకు తగ్గించింది. ఈ సర్వీసు కేవలం 50Mbps వేగం వరకు మాత్రమే వర్తిస్తుంది మరియు 1000Mbps వేగం కోరుకునే వారు మాత్రం 4,500 చెల్లించి కనెక్షన్ తీసుకోవాల్సివుంటుంది. అయితే, పూర్తి స్థాయిలో ఈ సర్వీసులు ప్రారంభం కానప్పటికీ, ఒక ప్రివ్యూ కార్యక్రమం ద్వారా కొన్ని ప్రణతాల్లో ఈ సేవలను అందించింది.
ఇక ప్లాన్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం రూమర్ల ప్రకారం 40Mbps ప్లాన్ కేవలం రూ.600 రూపాయల ధరకే అందిస్తోంది. అయితే 100Mbps సగం కోరుకునే వారు మాత్రం నెలకు 1,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, అన్ని సర్వీసులను తక్కువ ధరకే అందించే 'ట్రిపుల్ ప్లే ప్లాన్' కూడా సిద్ధం చేసినట్లు ఈ రూమర్లు చెబుతున్నాయి.