Jio Plans: రిలయన్స్ జియో ఇప్పటి వరకూ ఆఫర్ చేస్తూ వస్తున్న రెండు జబర్దస్త్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఎల్లుండి నుంచి నిలిపి వేస్తోంది. మార్కెట్ లో పెరుగుతున్న కాంపిటీషన్ మరియు ఖర్చుల కారణంగా తక్కువ ధరకే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ 5జి లాభాలను ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్ లను నిలిపి వేయడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) ని పెంచేందుకు చర్యలు చేపట్టిన జియో, ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
రిలయన్స్ జియో యొక్క రూ. 1,559 మరియు రూ. 395 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లను జూలై 3 వ తేదీ నుండి నిలిపివేస్తోంది. జియో యూజర్లకు అతి తక్కువ ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ 5జి లాభాలను అందించేలా రిలయన్స్ జియో ఈ రెండు ప్లాన్లు అందించింది. అయితే, ప్రస్తుతం పెంచనున్న యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా జియో యూజర్లకు అధిక లాభాలను అందిస్తాయి. వీటిలో రూ. 1,559 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని అందిస్తుంది మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.
ఇక రెండవ ప్లాన్ రూ. 336 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ చవక ధరలో 84 రోజుల వ్యాలిడిటీ అందించే జియో ప్లాన్ గా నిలుస్తుంది. ఈ 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని తీసుకువస్తుంది.
Also Read: OnePlus 12R పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
అయితే, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లు జూలై 3వ తేదీ నుంచి కనుమరుగై పోతాయి. అందుకే, ఈ ప్లాన్ లను రీఛార్జ్ చేయదలచిన యూజర్లు ఈ ప్లాన్ లను ఈ ముగింపు తేదీ లోపు రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఇది మాత్రమే కాదు, జియో యొక్క బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్ రేట్లు కూడా పెంచేస్తోంది. జియో యొక్క సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 155 ప్రీపెయిడ్ ప్లాన్ 22% శాతం పెరుగుతుంది మరియు రూ. 189 గా మారుతుందని చెబుతున్నారు.