టెలికాం రంగం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది మరియు మూడు ప్రధాన టెలికాం ప్రొవైడర్లయిన, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్-ఐడియా ఇటీవల తమ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి, ఇవి కొత్త టారిఫ్ మరియు వాయిస్ కాల్ ల కోసం FUP పరిమితిని తీసుకువచ్చాయి. ఇదిలా ఉండగా, రిలయన్స్ జియో తన జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రకటించిన ఉత్తమమైన ప్లాన్ అయినటువంటి, రూ .49 రీఛార్జ్ ప్లాన్ను ఇప్పుడు పూర్తిగా నిలిపివేసింది.
రూ .49 జియోఫోన్ రీఛార్జితో అన్‌లిమిటెడ్ జియో నుండి జియో వాయిస్ కాల్స్, 1 జిబి 4G డేటా, 50 SMS వంటి ప్రయోజనాలను అందిస్తోంది మరియు ఈ ప్లాన్ 28 రోజులు వ్యాలిడిటీతో ఉంటుంది. ఇప్పటి నుండి, జియోఫోన్ వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన రూ .75 రీఛార్జ్ ప్లాన్ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు 3 జీబీ డేటాను అందిస్తుంది. అయితే, వినియోగదారులు రోజుకు 0.1GB లేదా 100MB డేటాను ఉపయోగించవచ్చు. డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbps కి తగ్గిపోతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ఇతర నెట్‌వర్క్ లకు కాల్ చేయడానికి 500 నిమిషాలను కూడా తీసుకువస్తుంది. వినియోగదారులు Jio నుండి Jio నంబర్ కు అపరిమిత కాల్ లను పొందవచ్చు మరియు మొత్తం 50SMS ను కూడా ఉపయోగించవచ్చు.
జియో యొక్క ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ లో కంపెనీ రూ .125, రూ .155, రూ .185 చొప్పున మూడు కొత్త ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ప్లాన్ లకు 500 FUP కాల్ నిమిషాలు లభిస్తాయి మరియు ఈ ప్లాన్ వ్యవధి 28 రోజులుగా ఉంటుంది. అయితే, 125 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కు రోజుకు 0.5 జీబీ హై-స్పీడ్ డేటా, 300 SMS లు లభిస్తుండగా, రూ .155 ప్లానుకు రోజుకు 1 జీబీ డేటా, 100 SMS లభిస్తాయి. రూ .185 గురించి చూస్తే, వినియోగదారులు ఈ ప్లానుతో ప్రతిరోజూ 2 GB డేటా మరియు 100 SMS లను ఉపయోగించగలరు.