రిలయన్స్ JIO తన రెండు పాత ప్రీపెయిడ్ ప్లాన్లను మళ్ళి తెచ్చింది
అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం.
ఇప్పటి వరకూ తన వినియోగదారులకు తక్కువ ధరకే అన్ని ప్రయోజనాలను అందించిన జియో టెలికం, డిసెంబర్ 6 వతేది నుండి TRAI నియమాల ప్రకారం తన ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలను పెంచిన పెంచింది. అయితే, అన్ని AIO ప్లాన్స్ కూడా కొంచం ఎక్కువ ధరలతో ఉండగా, ప్రస్తుతం ముందుగా ఉన్నటువంటి రెండు సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ మరల తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ రెండు ప్లాన్స్ ఒక 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కాగా మరొకటి 149 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ 98 రుపాయల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ పూర్తి వ్యాలిడిటీకి గాను 2GB డేటా దొరుకుతుంది మరియు ఈ లిమిట్ ముగిసిన తరువాత డేటా స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అలాగే, 28 రోజులకు గాను 300 SMS లను కూడా అఫర్ చేస్తోంది. అయితే, ఈ 98 రూపాయల ప్లానుతో మీకు కేవలం జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం మాత్రమే దక్కుతుంది, ఎటువంటి ఉచిత ఇతర నెట్వర్క్ కాలింగ్ మీకు దొరకవు. ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం మీరు విడిగా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ 98 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ పూర్తి వ్యాలిడిటీకి గాను రోజుకు 1GB డేటా చొప్పున మొత్తం 24GB డేటా దొరుకుతుంది మరియు ఈ లిమిట్ ముగిసిన తరువాత డేటా స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అలాగే, రోజులకు గాను 100 SMS లను కూడా అఫర్ చేస్తోంది. అయితే, ఈ 98 రూపాయల ప్లానుతో మీకు కేవలం 300నిముషాల ఉచిత ఇతర నెట్వర్క్ కాలింగ్ మీకు దొరుకుతుంది మరియు జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దక్కుతుంది.