Jio Plans: ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ తో వచ్చే జియో బెస్ట్ ప్లాన్స్.!
ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ తో వచ్చే జియో బెస్ట్ ప్లాన్స్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్
Netflix మరియు Amazon వంటి ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ కొన్నే ఉన్నాయి
Jio Plans: ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ తో వచ్చే జియో బెస్ట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. అయితే, బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ, Netflix మరియు Amazon వంటి ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ కొన్నే ఉన్నాయి. జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర లాభాలను కూడా అందుకోవచ్చు.
Jio Plans With OTT Benefits
జియో యొక్క రూ. 1,099 మరియు రూ. 1,198 రూపాయల ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రెండూ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లను తీసుకువచ్చే బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి.
జియో రూ. 1,099 ప్లాన్
రిలయన్స్ జియో రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, 4జి నెట్ వర్క్ పైన రోజుకు 2GB చొప్పున 168GB డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అదే, 5జి నెట్ వర్క్ పైన అయితే అన్లిమిటెడ్ 5జి డేటాని అంధిస్తుంది. ఈ ప్లాన్ తో Netflix(Mobile) ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే, JioTV, JioCinema మరియు JioCloud లకు కూడా యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Vivo V30 Pro: టాప్ – 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!
జియో రూ. 1,198 ప్లాన్
ఈ జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని ఆనందించవచ్చు. అదే 4జి నెట్ వర్క్ పైన రోజుకు 2GB చొప్పున 168GB డేటాని అందిస్తుంది. అలాగే, రోజుకు 100SMS ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.
అయితే, ప్లాన్ తో Prime Video Mobile, Disney+Hotstar, Sony LIV మరియు ZEE5 పాటుగా మొత్తం 14 ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.