Jio Plans: రూ. 1,000 లోపల లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇవే.!

Jio Plans: రూ. 1,000 లోపల లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇవే.!
HIGHLIGHTS

రూ. 1,000 లోపల లాంగ్ వ్యాలిడిటీ అందించే Jio బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్

ఎక్కువ వ్యాలిడిటీ తక్కువ ఖర్చుతో అందించే రెండు బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి

ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి

Jio Plans: రూ. 1,000 లోపల లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ యూజర్లకు అందించింది. అయితే, వీటిలో రెండు బెస్ట్ ప్లాన్స్ ఎక్కువ వ్యాలిడిటీ తక్కువ ఖర్చుతో అందించే రెండు బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ రెండు ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము.

Jio Plans: ఏమిటా రెండు ప్లాన్స్?

రిలయన్స్ జియో యొక్క రూ. 899 మరియు రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈ బెస్ట్ ప్లాన్స్. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 899 ప్లాన్

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తీసుకు వస్తుంది. ఈ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో4G నెట్ వర్క్ పై డైలీ 2 GB డేటా మరియు 90 రోజులకు 20 GB అదనపు డేటా కూడా ఆఫర్ చేస్తుంది.

జియో రూ. 999 ప్లాన్

జియో యొక్క ఈ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది కాకుండా, 4G నెట్ వర్క్ పై డైలీ 2GB 4జి డేటా చొప్పున టోటల్ 196 GB డేటా కూడా అందిస్తుంది.

Also Read: LG 800W Soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్: 15 వేల బడ్జెట్ లో లభిస్తున్న సౌండ్ బార్.!

పైన తెలిపిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ ను కూడా కలిగి ఉంటాయి.

మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo