Jio Plan ఒకటి Free Amazon Prime సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ని ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మరి రిలయన్స్ జియో తన యూజర్లకి అందించిన ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలు మరియు వివరాలు తెలుసుకుందామా.
రిలయన్స్ జియో యొక్క 84 రోజుల వ్యాలిడిటీ అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ రూ. 1,029 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
జియో యొక్క ఈ రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే 84 రోజుల కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ అయితే రోజుకు 2GB డేటా చొప్పున 84 రోజులకు 168GB ల డేటాని ఆఫర్ చేస్తుంది.
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ సౌకర్యం కూడా అందుతుంది. ఇది కాకుండా ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో యొక్క Jio Cloud, Jio Tv మరియు Jio Cinema లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
Also Read: OnePlus 13 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరొక గొప్ప ప్రయోజనం కూడా వుంది. అదేమిటంటే, ఈ జియో ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 84 రోజుల Prime Video షబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ళ్ళం తో రీఛార్జ్ చేసే యూజర్లకు కంప్లీట్ ప్రయోజనాలు అందుతాయి.
మారిని Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here