జియో కొత్త Rs.749 ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ సర్వీసులు
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్
సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ సర్వీసులు
జియో యూజర్ల కోసం ఒక కొత్త ప్లాన్ విడుదల చేసింది
ఇండియాలో ఉచిత 4G సర్వీసులు అందించిన ఏకైక టెలికం సంస్థగా నిలుస్తుంది. ఇప్పుడు, జియో మరొక కొత్త ప్లాన్ తన కస్టమర్ల కోసం ప్రకటించి ఆకట్టుకుంది. జియోఫోన్ యూజర్ల కోసం ఒక కొత్త ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియోఫోన్ యూజర్లు ఒక సంవత్సరం అన్లిమిటెడ్ సర్వీసులు పొందవచ్చు.
అయితే, ఇప్పటికే వున్నా జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రం పూర్తిగా ఒక సంవత్సరం అంతా కాలింగ్, డేటా మరియు SMS లతో సహా అన్లిమిటెడ్ సర్వీస్ ను అందించే ప్లాన్ ను అందించింది. అయితే, మీరు తెల్సుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ వున్నాయి. జియో యొక్క జియోఫోన్ లేటెస్ట్ అన్లిమిటెడ్ 749 రూపాయల ప్లాన్ కొన్ని కండిషన్స్ కలిగి వుంది.
జియోఫోన్ కస్టమర్ల కోసం జియో కొత్తగా 749 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ తో రీచార్జి చేస్తే మీకు మొత్తంగా ఒక సంవత్సరం అన్లిమిటెడ్ సర్వీసులు అందుతాయి. అయితే, ఈ ప్రయోజనాలను దశల (సైకిల్స్) వారీగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో నెలకు (28 రోజులకు) లకు 2GB చొప్పున 12 సైకిల్స్ (నెలలకు) ఈ 24 జీబీ డేటా ఇస్తుంది. అలాగే, SMS లు కూడా నెలకు (28 రోజులకు) 50 చొప్పున లిమిట్ సెట్ చేసింది. వ్యాలిడిటీ విషయంలో కూడా 1 సైకిల్ కి 28 రోజుల మొత్తం 12 సైకిల్స్ కి 336 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, కాలింగ్ మాత్రం ఎటువంటి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ గా ప్రకటించింది. అధనంగా, జియో యాప్స్ కి యాక్సెస్ వుంటుంది.