ప్రస్తుతం, OTT ప్లాట్ఫారం అందరికంటే ముందంజలో నడుస్తోంది. లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో OTT ప్లాట్ఫారాలు మరింతగా పుంజుకున్నాయి. వీటిలో, Netflix, Amazon Prime, Hotstar, SonyLive , Zee 5, SunNext మరియు Voot వంటి చాలా OTT ప్లాట్ఫారాలు వున్నాయి. అయితే, వీటి సభ్యత్వానికి రుసుమును చెల్లించాల్సి వస్తుంది. అయితే, ప్రధాన టెలికం సంస్థలు తమ ప్లాన్స్ ద్వారా ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ OTT ప్లాట్ఫారాల యొక్క సభ్యత్వం ఉచితంగా అఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు, JIo తన అనేక ప్లాన్స్ ద్వారా అమెజాన్ ప్రైమ్, Disney+ Hotstar మరియు మరిన్ని సేవలకు ఉచిత సభ్యత్వాన్ని అఫర్ చేస్తోంది.
జియో గతంలో Hotstarతో కలిసి పనిచేసింది, ఈ నెట్వర్క్ ప్రొవైడర్ తన వినియోగదారులకు ఉచిత Hotstar Premium సభ్యత్వాన్ని ఉచితంగా ఇచ్చింది. ఈ ఒప్పందంలో, హాట్స్టార్ కంటెంట్ JioPlay App లో తీసుకురాబడుతుంది మరియు తద్వారా వినియోగదారులు పెద్ద మొత్తంలో కంటెంట్ యాక్సెస్ అందుకున్నారు.
రూ .401 నెలవారీ ప్లాన్: ఈ ప్లాన్ 90 GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు జియో యాప్స్ యొక్క యాక్సెస్ అందిస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
రూ .2,599 వార్షిక ప్లాన్: ఈ ప్లాన్ 740 జిబి డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది. ఇది 365 రోజులు చెల్లుబాటుతో వస్తుంది.
Add-On డేటా ప్యాక్: పైన తెలిపిన ప్లాన్స్ లేని చందాదారులు 612 రూపాయల నుండి ప్రారంభమయ్యే డేటా యాడ్-ఆన్ వోచర్ల ద్వారా ఈ సేవను పొందవచ్చు. ఇది వినియోగదారులకు డేటా ప్రయోజనాలతో పాటుగా Disney+ Hotstar యొక్క 1 సంవత్సరం ఉచిత VIP సబ్ స్క్రిప్షన్ పొందటానికి అనుమతిస్తుంది.
రిలయన్స్ జియో, తన జియో ఫైబర్ కస్టమర్లకు ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా ఇచ్చింది. రూ. 999 రూపాయల విలువగల ఈ Amazon Prime సభ్యత్వాన్ని ఉచితంగా ప్రకటించింది. అంటే, ఎటువంటియూ అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలను వీక్షించే అవకాశం మీకు దక్కుతుంది. మీరు దీని కోసం విడిగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రిలయన్స్ జియో నుండి, ఇది మీకు వన్-టైమ్ ఆఫర్ గా మాత్రమే ఇస్తోంది. ఈ ఆఫర్ Jio యొక్క JIoFiber వినియోగదారులకు మాత్రమే.
ఈ ఆఫర్ త్రైమాసిక (క్వార్టర్) సిల్వర్ ప్లాన్ రూపంలో మై జియో యాప్ నుండి కొత్త ఆఫరుగా ప్రకటించింది. కాని కొంతమంది నెలవారీ ప్లాన్ యూజర్లు తమ కోసం ఈ ప్లాన్ ఇంకా ఇక్కడ కనిపించలేదని చెప్పారు. . ఈ ఆఫర్ ఎంచుకున్న ప్లాన్లతో లేదా త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్లాన్స్ తో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ గురించి మాట్లాడితే, దీని ప్రకారం, మీకు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వాడుతుంటే, మీరు ఈ ప్లాన్ ఆఫర్ను పొందలేరు, అయితే మీ మొదటి షబ్ స్క్రిప్షన్ గడువు ముగిసే వరకు మీరు వేచి ఉన్న తరువాత మాత్రమే, మీరు ఈ Live అఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు.
జియో ఇటీవల తన జియో సెట్-టాప్ బాక్స్ కి ప్రైమ్ వీడియో యాప్ జోడించింది. సంస్థ ఇప్పటికే కొన్ని జియో ఫైబర్ ప్లాన్లతో Hotstar , SonyLive , Zee 5, SunNext ,Voot మరియు Jio Cinema చందాలను అందిస్తోంది.
Jio యొక్క అనేక ఇతర ప్లాన్స్ గురించి ఇక్కడ ( Click ) తెలుసుకోండి!