Jio కస్టమర్లకు 2GB ఉచిత డేటా ఇస్తోంది చెక్ చేసుకోండి

Jio కస్టమర్లకు 2GB ఉచిత డేటా ఇస్తోంది చెక్ చేసుకోండి
HIGHLIGHTS

నాలుగు రోజుల చెల్లుబాటుతో ఉచిత డేటాని ఖాతా‌లో జమ చేస్తుంది.

రిలయన్స్ జియో తన వినియోగదారులకు 2GB ఉచిత కాంప్లిమెంటరీ డేటాను అందిస్తోంది. ఈ టెలికాం దిగ్గజం గత నెలలో ఇదే విధమైన టారిఫ్ వోచర్‌ను జియో వినియోగదారుల  కోసం విడుదల చేసింది. ఇప్పుడు ఇది నాలుగు రోజుల చెల్లుబాటుతో ఉచిత డేటా వినియోగదారుల ఖాతా‌లో జమ చేస్తుంది.

ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు తమ జియో ఖాతాలకు కొత్త జియో డేటా ప్యాక్ టారిఫ్ ప్లాన్ ‌తో జమ చేసినట్లు పోస్ట్ చేయడంతో ఈ వార్త బయటికి వచ్చింది. దీని ప్రకారం,  నాలుగు రోజుల పాటు కాంప్లిమెంటరీగా 2 జిబి డేటాను అందిస్తుంది. నెల ముగిసే సమయానికి, తమ ఖాతాలను నిర్ణీత సమయంలో రీఛార్జ్ చేయలేని కస్టమర్లకు ఈ వార్త కొంత ఊరటనిస్తుంది.

ఉచిత డేటా ప్యాక్ పొందటానికి జియో సబ్ స్క్రిబర్స్ ఏమి చేయాల్సి ఉంటుందనే విషయం మాత్రం స్పష్టంగా లేదు. ఎందుకంటే, రాబోయే మూడు-నాలుగు రోజుల్లో టారిఫ్ ప్లాన్ వ్యాలిడిటీ ముగియబోయే వినియోగదారులకు కంపెనీ క్రెడిట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

మీకు Jio డేటా ప్యాక్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేయాలి?

MyJioAPP  తెరిచి, మూడు గీతల హాంబర్గర్ మెను చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఎంపికల జాబితా నుండి My Plan ఎంచుకోండి. ఇప్పుడు  మీరు ప్రస్తుత ప్లాన్ వివరించే స్క్రీన్‌కు వెళతారు. మీరు Jio యొక్క ఉచిత డేటా ప్యాక్ ‌ని అందుకుంటే, ఆ టారిఫ్ ప్లాన్ వివరాలతో కూడిన కార్డ్ అక్కడ ఉంటుంది.

ఈ Jio డేటా ప్యాక్ మీ ప్రస్తుత టారిఫ్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీని పొడిగించదు మరియు మీ డేటా వ్యాలిడిటీ త్వరలో ముగిసినట్లయితే ఇది యాడ్-ఆన్ ప్యాక్‌ గా పనిచేస్తుంది.

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఇంటి నుండి పనిచేసే ప్రతిఒక్కరికీ రిలయన్స్ జియో సవరించిన టారిఫ్ ప్లాన్స్ అందిస్తోంది. గతంలో, జియో, ఎయిర్టెల్ ‌తో సహా టెలికాం ఆపరేటర్లను తమ ప్రీపెయిడ్ ప్లాన్ల వ్యాలిడిటిని పొడిగించాలని ట్రాయ్ కోరింది. అలాగే, జియో కొత్త వర్క్ ఫ్రేమ్ హోమ్ టారిఫ్ ప్లాన్లను కూడా విడుదల చేసింది. ఇది ఒక నెల వ్యాలిడిటీతో ఎక్కువ డేటాను అందిస్తుంది. వోడాఫోన్-ఐడియా మరియు ఎయిర్‌టెల్ కూడా తమ వినియోగదారులకు సహాయం చేయడానికి ఇలాంటి ప్లాన్లను విడుదల చేశాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo