Jio నెక్స్ట్ టార్గెట్ : సరసమైన పెద్ద – స్క్రీన్ స్మార్ట్ ఫోన్
ఇప్పుడు ఒక పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి జియో పనిచేస్తోంది, VoWiFi ని కమర్షియల్ గా తీసుకురాడానికి పరీక్షిస్తున్నట్లు కనిపించింది.
ముఖ్యాంశాలు:
1. ప్రస్తుత 4G ఫీచర్ ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జీయో ఒక పెద్ద-స్క్రీన్ సరసమైన స్మార్ట్ ఫోన్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
2. జియో దాని తరువాతి దశలలో VoWiFi సేవను పరీక్షిస్తున్నట్లు కూడా ఉంది
3. సెల్యులార్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో వైర్లెస్ నెట్వర్క్ల ద్వారా వినియోగదారులలకు ఫోన్ కాల్స్ ను చేసుకోవడానికి VoWiFi అనుమతిస్తుంది
JioPhone2 విజయం తర్వాత, రిలయన్స్ జీయో 4G- ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోనుతో అప్గ్రేడ్ చేసే ఉద్యేశ్యమున్న వినియోగదారుల అవసరాన్ని తీర్చటానికి ఒక "సరసమైన పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ "ని మార్కెట్లోకి తీసుకురావడానికి కృషిచేస్తోంది. ET ద్వారా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఈ ఫోన్ కోసం Jio ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
US కాంట్రాక్ట్ తయారీదారు Flex తో కలిసి పనిచేయడం ద్వారా సామాన్య వినియోగదారులను మరియు వారి ధరల అంచనాలను టార్గెట్ చేసుకొని మార్కెట్ వాటాను వేగంగా విస్తరించడానికి 100 మిలియన్ స్మార్ట్ ఫోన్ బ్యాచ్ ని స్థానికంగా తయారు చేయాలని జియో వెల్లడించింది.
"మేము వినియోగదారులను 4G- స్మార్ట్ ఫోనుకు మళ్ళించడానికి, ఇంకా ఎక్కువ మంది వినియోగదారులకు సరసమైన పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చే భాగస్వాములతో పని చేయడానికి ప్రయత్నిస్తున్నాము, తద్వారా వారు ధరలకు అనుగుణంగా ఉన్న పరికరాలపై, సరైన కనెక్టివిటీని అలాగే సరైన కనెక్షన్ అనుభవాన్నిమరియు కంటెంట్ ని ఆస్వాదించవచ్చు", అని రిలయన్స్ హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ ఛానల్ డెవలప్మెంట్, సునీల్ దత్ ఎకనామిక్స్ టైమ్స్ కి చెప్పారు.
రిలయన్స్ జీయో మరోసారి తన VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సేవను పరీక్షించి, జులై తరువాత ఈ పరీక్షా నిర్వహించిన దేశంలోమూడవ అతిపెద్ద తేలికో సంస్థగా ఆవిష్కరించబడింది. అనంతరం, ఈఫీచర్ కొన్ని నెలల్లో ప్రసారం చేయబడుతుందిని నివేదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి అనేక సర్కిళ్లలో జియో ఈ ఫిచరును పరీక్షించారని టెలికాం టాక్ ఒక నివేదికలో పేర్కొంది. మధ్యప్రదేశ్ నుండి ఒక వినియోగదారు ఈ ఫీచర్ యొక్క స్క్రీన్షాట్ను ఒక ప్రచురణతో నివేదించారు. ఈ స్క్రీన్షాట్ లో, ఒక ఐఫోన్ Jio యొక్క VoWiFi సర్వీసు ఆన్ చేసినట్లు చూడవచ్చు. ఇది జియో పరీక్ష తరువాత దశలలో ఉంటుందని మరియు 2019 జనవరిలో బహుశా ఆరంభమవుతుందిని తెలియచేస్తోంది.
VoWiFi లేదా వాయిస్ ఓవర్ Wi-Fi, సెల్యులార్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో దీనిని ఉపయోగించి వైర్లెస్ నెట్వర్కులకు కాల్స్ చేస్తాయి. దేశవ్యాప్తంగా ఉచిత పబ్లిక్ Wi-Fi హాట్ స్పాట్లను వ్యవస్థాపించడానికి ప్రభుత్వ పథకం ద్వారా ఈ ఫీచర్ సాయపడుతుంది. ఇది ప్రారంభమయితే, అస్థిర సెల్యులార్ కనెక్టివిటీని కలిగి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మరింత నెట్వర్కు మరియు స్మార్ట్ ఫోనులు అందుబాటులో ఉంటాయి, మరియు జీయో 4G ఫీచర్ ఫోన్ వినియోగదారుల మధ్య మార్కెట్ వాటాను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
DoT నియమాల ప్రకారం భద్రతా పరీక్షను జియో ఇప్పటికే పూర్తి చేసిందని అంతకుముందు వచ్చిన నివేదిక వెల్లడించింది. ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ కూడా ఆ వేదికను అధిగమించాయి మరియు తమ నెట్వర్క్స్లో VoWiFi ని తీసుకురానున్నాయి.
తిరిగి జూన్ లో, భారత టెలిఫోన్ను అనుమతించే లైసెన్స్ అవసరాలకు DoT కి అప్డేట్ చేసిన తరువాత ఈ చర్య తీసుకుంటుంది. ముసాయిదా ప్రకారం, VoWiFi సహాయంతో, ప్రభుత్వం యొక్క బహిరంగ Wi-Fi ప్రాజెక్ట్ మెరుగ్గా చేయబడుతుంది.