మరొక మెట్టెక్కిన JIO : మొట్టమొదటిసారిగా ఇండియాలో, అంతర్జాతీయ VoLTE రోమింగ్ ప్రణాలికను ప్రవేశపెట్టింది
భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్య ఈ ప్రణాలికను ప్రారంభించింది.
ప్రారంభించినప్పటి నుండి సరికొత్తధనాన్ని అందించిన జియో, ఇప్పుడు మరొక మైలురాయిని చేరుకుంది. jio ఇప్పుడు కొత్తగా, మరొక సంచలన ప్రణాలికను మొదటి సరిగా భారతీయ టెలికాంలో ప్రవేశపెటింది అదే, ఈ అంతర్జాతీయ VoLTE రోమింగ్ ప్రణాళిక. ఈ ప్రణాళికను, ముందుగా జపాన్ మరియు ఇండియా దేశాల మధ్య తీసుకొచ్చింది.
ఈ అంతర్జాతియ రోమింగ్ ప్రణాళిక ఇప్పటివరకు ఇండియాలో అందుటులో లేదు. ఈ వొల్టీ అంతర్జాతీయ రోమింగ్ ద్వారా, ఇండియా నుండి జపాన్ వెళ్లిన ప్రయాణికులు జపానులో కూడా నాణ్యమైన కాలింగ్ మరియు LTE స్పీడ్ డేటా సౌలబ్యాన్ని పొందవచ్చు. అయితే, ఈ అవకాశం కేవలం జియో వినియోగదారులకి మాత్రమే సొంతం.
అలాగే, ఈ అవకాశాన్ని అందిస్తున్న మొట్టమొదటి సంస్థ జపాన్ బేస్డ్ కంపెనీ అయినటువంటి, KDDI కార్పొరేషన్. ఇండియా నుండి జపాన్ మరియు జపాన్ నుండి ప్రయాణించే జియో మరియు KDDI వినియోగదారులు, ఈ అంతర్జాతీయ VoLTE రోమింగ్ సేవలను(నాణ్యమైన కాలింగ్ మరియు LTE స్పీడ్ డేటా) సంపూర్ణంగా ఆనందించవచ్చు.