Jio New Year Plan: కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా యూజర్ల కోసం కొత్త న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ ను రిలయన్స్ జియో అనౌన్స్ చేసింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని లిమిటెడ్ పీరియడ్ కోసం మాత్రమే అందించింది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కొంతకాలం మాత్రమే యూజర్ల కోసం అందుబాటులో ఉంటుంది. మరి రిలయన్స్ జియో తీసుకు వచ్చిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు ఏమిటో చూద్దామా.
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం 2025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ గా రూ. 2025 రూపాయల ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ రోజు మొదలుకొని నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, 2024 డిసెంబర్ 11వ తేదీ నుంచి 2025 జనవరి 11వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
జియో న్యూ ఇయర్ ప్లాన్ రూ. 2,025 రూపాయల ధరతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB 4G డేటా మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా బెనిఫిట్ ను కూడా అందిస్తుంది.
ఈ జియో ప్లాన్ తో జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ అందించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో Ajio షాపింగ్ పై రూ. 500 తగ్గింపు, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ పై రూ. 1,500 వరకు తగ్గింపు మరియు Swiggy ఆర్డర్స్ పై రూ. 150 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయి.
Also Read: చవక ధరలో రెండు కొత్త Smart Tv లను లాంచ్ చేసిన Daiwa.!
షరతులు ఏమిటంటే, Ajio పై Rs 2,999 రూపాయలకు పైగా షాపింగ్ చేస్తే రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే, EaseMyTrip.com ద్వారా చేసే ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ పై మాత్రమే ఈ రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది. అలాగే, Rs.499 మరియు అంతకన్నా ఎక్కువ విలువ చేసే ఆర్డర్ పై మాత్రమే ఈ Rs.150 తగ్గింపు అందుతుంది.
మరిన్ని బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here