Jio New Year 2025 Offer: రిలయన్స్ జియో కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభం కోసం ప్రతీ సంవత్సరం న్యూ ఇయర్ ఆఫర్ ను జియో అందిస్తోంది. ఈ ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రిలయన్స్ జియో ‘ న్యూ ఇయర్ వెల్కమ్’ ప్లాన్ ను అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో న్యూ ఇయర్ వెల్కమ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కేవలం పరిమిత సమయానికి మాత్రమే అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కొత్త సంవత్సరం నెంబర్ తోనే అందించింది. ఈ ప్లాన్ ను రూ. 2025 రూపాయలకు అందించింది మరియు ఈ ప్లాన్ అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 200 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 200 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100SMS వంటి అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
అదే 4జి నెట్ వర్క్ అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 2.5 GB హాయ్ స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
అవేమిటంటే, EaseMyTrip.com నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసే వారికి రూ. 1500 రూపాయల వరకు తగ్గింపు అందుతుంది. అలాగే, Ajio నుంచి రూ. 2999 రూపాయలకు పైబడి షాపింగ్ చేసే వారికి రూ. 500 తగ్గింపు మరియు Swiggy పై రూ. 499 పైగా చేసే ఆర్డర్ పై రూ. 150 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇవన్నీ లెక్కగడితే రూ. 2,150 రూపాయలు ఉంటుంది.
Also Read: Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే.!
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ప్లాన్ రేటును మించిన లాభాలు అందుకోవచ్చని జియో చెబుతోంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 11 డిసెంబర్ 2024 నుంచి 11 జనవరి 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరిన్ని Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను చెక్ చేయడం కోసం Click Here