జియో బెస్ట్ ప్లాన్స్: గొప్ప ప్రయోజనాలను అందిస్తున్న జియో కొత్త ప్లాన్స్ ఇవే.!

జియో బెస్ట్ ప్లాన్స్: గొప్ప ప్రయోజనాలను అందిస్తున్న జియో కొత్త ప్లాన్స్ ఇవే.!
HIGHLIGHTS

జియో యూజర్ల అవసరానికి అనుగుణంగా కొత్త ప్లాన్ లను పరిచయం చేస్తోంది

జియో మూడు కొత్త ప్లాన్ లను వినియోగదారుల కోసం ప్రకటించింది

ఈ మూడు కొత్త ప్లాన్స్ కూడా వినియోగదారులకు గొప్ప ప్రయోజాలను అఫర్ చేస్తున్నాయి

రిలయన్స్ జియో యూజర్ల అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను పరిచయం చేస్తోంది. ఇటీవల కూడా జియో మూడు కొత్త ప్లాన్ లను వినియోగదారుల కోసం ప్రకటించింది. ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ అధిక డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తాయి. రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఆ మూడు బెస్ట్ ప్లాన్స్ మరియు అవి అందించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. 

జియో 2023 కొత్త సంవత్సర అఫర్ లో భాగంగా కొత్త రూ.2023 ప్లాన్ ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తో పాటుగా గత వారం మరో రెండు ప్లాన్ లను కూడా తీసుకొచ్చింది. అవి: రూ.349 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్స్. ఈ మూడు కొత్త ప్లాన్స్ కూడా వినియోగదారులకు గొప్ప ప్రయోజాలను అఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాన్స్ అందిస్తున్న ప్రయోజనాలను చూద్దామా. 

జియో కొత్త రూ.2023 ప్లాన్

జియో కొత్త రూ.2,023  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

జియో కొత్త రూ.349 ప్లాన్

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

జియో కొత్త రూ.899 ప్లాన్

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo