జియో అఫర్: అధిక లాభాలతో రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.!

Updated on 23-Jan-2023
HIGHLIGHTS

అధిక లాభాలతో రెండు కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో

వినియోగధారులకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్

ఈ రెండు ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

జియో అఫర్: అధిక లాభాలతో రెండు కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో. తన వినియోగధారులకు అధిక లాభాలను అందించే విధంగా రిలయన్స్ జియో లేటెస్ట్ గా రూ.349 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ లను లాంచ్ చేసింది. వీటిలో, రూ.349 ప్లాన్ 30 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజాలతో మరియు రూ.899 ప్లాన్ 90 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తాయి. జియో కొత్తగా ప్రకటించిన ఈ రెండు ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.   

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :