Jio: రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో..!

Updated on 23-Jan-2023
HIGHLIGHTS

రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియోలో మరొక రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను జత చేసింది

రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ లను జియో తన వినియోగదారుల కోసం లాంచ్ చేసింది

కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ మరియు అవి అందించే లాభాలు

రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియోలో మరొక రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను జత చేసింది. సింపుల్ గా చెప్పాలంటే, రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ లను జియో తన వినియోగదారుల కోసం లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్స్ కూడా అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో పాటుగా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో కొత్తగా లాంచ్ చేసిన ఈ రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ మరియు అవి అందించే లాభాలు ఏమిటో తెలుసుకుందామా. 

రిలయన్స్ జియో లేటెస్ట్ గా రూ.349 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ లను లాంచ్ చేసింది. ఇందులో, రూ.349 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మరియు రూ.899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్స్ పూర్తి వివరాలను ఈ క్రింద చూడవచ్చు. 

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :