దేశంలోని నలుమూలలా ఉన్న ప్రతి ఒకరికి చవక ధరలో 4G ఫోన్ ను అందులోకి తీసుకు రావడానికి జియో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే Jio Phone Prima ఫీచర్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను రూ. 2,599 ధరలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను కూడా రిలయన్స్ జియో తీసుకు వచ్చింది. ఈ కొత్త పాన్ లను రూ. 75 మొదలుకొని రూ. 895 రూపాయల వరకూ విస్తరించింది. జియో అందించిన ఈ కొత్త ప్లాన్ లు అందించే అన్ని ప్రయోజనాలు తెలుసుకోండి.
జియోఫోన్ ప్రైమా ఫీచర్ ఫోన్ కోసం రిలయన్స్ జియో రూ. 75, రూ. 91, రూ. 125, రూ. 152, రూ. 186, రూ. 223 మరియు రూ. 895 ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100MB డేటా, 50SMS లు మరియు 200MB అదనపు డేటా కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100MB డేటా, డైలీ 50SMS లు మరియు 200MB అదనపు డేటా కూడా అందుతుంది.
ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 0.5 GB డేటా, 300 SMS లు అందిస్తుంది. ఈ ప్లాన్ తక్కువ ధరలో అధిక డేటా కోరుకునే వారికి సరిపోతుంది.
Also Read : [Exclusive] iQOO 12 ఫస్ట్ లుక్ అవుట్…ఫోన్ మాములుగా లేదుగా.!
ఈ జియోఫోన్ ప్రైమా ఫోన్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అలాగే, ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 0.5 GB డేటా, 300 SMS లు తీసుకు వస్తుంది.
ఈ రెండు జియోఫోన్ ప్రైమా ఫోన్ ప్లాన్ లు కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి. ఈ రెండు ఈ ప్లాన్ లు కూడా వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు అందిస్తాయి. అయితే, ఈ ప్లాన్స్ అందించే రోజువారీ డేటాలో మార్పులు ఉంటాయి. రూ. 186 ప్లాన్ రోజుకు 1GB డేటా అందిస్తే, రూ. 223 ప్లాన్ రోజు 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది.
ఈ ప్లాన్ జియోఫోన్ ప్రైమ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో వుండే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ఇది 12 నెలలకు 28 రోజుల చొప్పున లాభాలను అందిస్తుంది. అంటే, నెలకు 2GB డేటా, 50 SMS లు మరియు మొత్తం వ్య;వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. ఈ విధంగా 12 నెలకు గాను ప్రయోజనాలను అందిస్తుంది.