JioTv+: 800 కంటే అధిక ఛానల్స్ మరియు 14 OTT లతో కొత్త సర్వీస్ ప్రారంభించిన జియో.!
రిలయన్స్ జియో కొత్త జియో టీవీ ప్లస్ యాప్ ని తెచ్చింది
ఈ యాప్ 800 పైగా ఛానల్స్ మరియు 14 OTT లకు యాక్సెస్ అందిస్తుంది
జియో కొత్త సర్వీసులు మరియు ప్లాన్ లతో మార్కెట్ లో చాలా వేగంగా దూసుకుపోతోంది
JioTv+: రిలయన్స్ జియో కొత్త సర్వీసులు మరియు ప్లాన్ లతో మార్కెట్ లో చాలా వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఉచిత జియో టీవీ యాప్ మరియు చవక ధరలో వచ్చే జియో సినిమా యాప్ తో ఎంటర్టైన్మెంట్ విభాగంలో వేగంగా తన మార్క్ ను ముద్రిస్తున్న జియో, ఇప్పుడు అదే వేగంతో ఈ కొత్త జియో టీవీ ప్లస్ యాప్ ని తెచ్చింది. ఈ యాప్ లేదా సర్వీస్ తో 800 పైగా ఛానల్స్ మరియు 14 OTT లకు యాక్సెస్ ను కూడా అందిస్తోంది.
ఏమిటి ఈ JioTv+?
జియో టీవీ ప్లస్ అనేది రిలయన్స్ జియో యొక్క కంటెంట్ ఆగ్రిగేటర్ ప్లాట్ ఫామ్ మరియు ఇది జియో ఫైబర్ ప్లాన్ తో జియో సెట్ టాప్ బాక్స్ లో ఇన్ బిల్ట్ గా వచ్చే యాప్. ఈ యాప్ ద్వారా 800 కంటే అధిక ఛానల్స్ మరియు 14 OTT లకు యాక్సెస్ అందిస్తుందని జియో తెలిపింది.
మరి JioTv మరియు JioTv+ మధ్య వ్యత్యాసం ఏమిటి?
జియో చాలా కాలంగా ఆఫర్ చేస్తున్న ఉచిత జియో టీవీ యాప్ కి మరియు కొత్త తెచ్చిన ఈ జియో టీవీ ప్లస్ యాప్ కి మధ్య చాలా వ్యత్యాసం వుంది. జియో టీవీ యాప్ మొబైల్ ఫోన్ మరియు టీవీ లలో కూడా నడుస్తుంది. అయితే, జియో టీవీ ప్లస్ యాప్ మాత్రం కేవలం జియో ఫైబర్ తో వచ్చే సెట్ టాప్ బాక్స్ లో ప్రీ ఇన్స్టాల్ గా మాత్రమే వస్తుంది. అంటే, ఇది కేవలం సెటప్ టాప్ బాక్స్ ద్వారా టీవీ లలో మాత్రమే నడుస్తుంది.
జియో టీవీ ప్లస్ ఉచితంగా లభిస్తుందా?
జియో టీవీ ప్లస్ ను రూ. 1,499 రూపాయల జియో ఫైబర్ ప్రీమియం ప్లాన్ తో ఉచితంగా లభిస్తుంది. అయితే, మిగిలిన జియో ఫైబర్ ప్లాన్ లతో ఇది ఎంత రేటుకు లభిస్తుంది అనే విషయం ఇంకా తెలియ రాలేదు.
Also Read: MOTOROLA G45 5G స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో వచ్చింది.!
జియో టీవీ ప్లస్ తో వచ్చే లాభాలు ఏమిటి?
జియో టీవీ ప్లస్ తో 800 కి పైగా లైవ్ ఛానెల్స్ ను చూడవచ్చు. అంతేకాదు, 14 కంటే పైగా OTT యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుందని జియో తెలిపింది.