JIOPHONE కోసం నాలుగు కొత్త All-IN-ONE ప్లాన్స్ ప్రకటన : రూ.75 తో ప్రారంభవవుతాయి
ఈ కొత్త ప్లాన్లు రీఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
రిలయన్స్ జియో, నాలుగు కొత్త జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల ప్రారంభ ధర రూ .75 తో ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, మిగతా మూడు ప్లాన్ల గురించి చూస్తే, ఇవి రూ .125, రూ .155, రూ .185. ధరలలో ఉంటాయి మరియు వీటన్నింటికీ కూడా 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రీపెయిడ్ వినియోగదారుల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల మాదిరిగానే, రోజువారీ డేటాతో కూడిన ఈ జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్, జియో నుండి జియోకు ఉచిత వాయిస్ కాలింగ్, ఆఫ్-నెట్ వాయిస్ కాలింగ్ నిమిషాలు, నిర్ణీత సంఖ్యలో SMS లు మరియు మరిన్ని లాభాలతో వస్తాయి. ఇంతకుముందు రిలయన్స్ జియో రూ .49, రూ .99, రూ .153 ధరల,లో ఈ జియోఫోన్ ప్లాన్లను అందిస్తోంది. మైజియో యాప్ మరియు రిలయన్స్ జియో వెబ్‌సైట్ ద్వారా ఈ కొత్త ప్లాన్లు రీఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ముందుగా, ఈ 75 రూపాయల ధరలో వచ్చే ప్లాన్ గురించి మాట్లాడితే, ఇందులో మీకు రోజుకు 100MB చొప్పున పూర్తిగా 3GB డేటా ఇవ్వబడుతోంది, ఇది కాకుండా మీరు అపరిమిత Jio-to-Jio కాలింగ్ యొక్క ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. 50 SMS లతో పాటుగా 500 నిమిషాల నాన్-జియో కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, రూ .125 ధరతో వస్తున్న ఆల్ ఇన్ వన్ ప్లాన్ తో, మీరు అపరిమిత జియో-టు-జియో కాలింగ్ తోపాటుగా, 500 నిమిషాల నాన్-జియో కాలింగ్ మరియు 0.5GB రోజువారీ డేటా అందుతోంది. అధనంగా, 300 SMS లను కూడా పొందుతారు మరియు ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు.
ఇది కాకుండా, రూ .155 ధరతో వచ్చే ప్లాన్ గురించి చర్చిస్తే, ఈ ప్లానులో రోజుకు 1 GB చొప్పున డేటాను పొందనున్నారు. అంతే కాదు, ఈ ప్లాన్ లో కూడా మీరు జియో-టు-జియో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు కూడా పొందునున్నారు. అలాగే, 500 నిమిషాల నాన్-లైవ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందుతుంది. ముందుగా చెప్పినట్లుగా, ఈ ప్లాన్ యొక్కవ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే.
చివరగా, 185 రూపాయల ధరలో వస్తున్న రిలయన్స్ జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్ వివరాల్లోకి వెళితే, ఈ ప్లానులో మీకు 2GB రోజువారీ డేటా ఇవ్వబడుతోంది, ఇందులో కూడా Jio-to-Jio అపరిమిత కాలింగ్ మరియు 500 నిమిషాల నాన్-లైవ్ కాలింగ్ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, ఈ ప్లాన్ మీకు రోజుకు 100 SMS లతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కూడా 28 రోజులు. ఇది మాత్రమే కాదు, పైన పేర్కొన్న అన్ని ప్లాన్స్ కూడా Jio యొక్క యాప్స్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో వస్తున్నాయి, వీటిలో JioTV, Jio Cinema, Jionews మరియు మరిన్ని ఉన్నాయి.