జియో సంచలనం: ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ తెచ్చిన జియో

Updated on 09-Jul-2021
HIGHLIGHTS

జియో సంచలనమైన నిర్ణయం

ఎమర్జెన్సీ సమయంలో డేటా లోన్

జియో ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ

రిలయన్స్ జియో మరొక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. జియో కస్టమర్లకు అత్యవసర సమయంలో సహాయపడేలా ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ ని తీసుకొచ్చింది. జియో కస్టమర్లు వారి హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తరువాత ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ ద్వారా డేటాని లోన్ గా తీసుకోవచ్చు. ఈ డేటాని తిరిగి చెల్లించేందుకు ప్లాన్స్ ని కూడా జియో తీసుకొచ్చింది. ఈ ఫెసిలిటీని మై జియో యాప్   ద్వారా ఉపయోగించుకోవాలి.

అనుకోని కారణాల వాల్ల రీఛార్జ్ చేయలేక పోయిన సమయంలో జియో కస్టమర్లకు ఈ ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ ద్వారా నిరంతర డేటా అవసరాన్ని తీర్చేలా ఉంటాయి. మై జియో యాప్ నుండి ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ తో ఎమర్జెన్సీ డేటా ఎలా పొందాలో  ఈ క్రింద దశలలో చూడవచ్చు.

జియో ఎమర్జెన్సీ డేటా ఎలా పొందాలి?

  • మై జియో యాప్ తెరిచి మెనూ లోకి వెళ్ళండి
  • ఇందులో మొబైల్ సర్వీస్ లో ఉన్న 'ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ' ని ఎంచుకోండి
  • ఇక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ బ్యానర్ పైన నొక్కండి
  • ఇక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ బ్యానర్ లోని 'ప్రొసీడ్' పైన నొక్కండి
  • తరువాత 'గెట్ ఎమర్జెన్సీ డేటా' అప్షన్ ఎంచుకోండి
  • ఇక్కడ 'యాక్టివేట్ నౌ' పైన నొక్కండి

అంటే, ఈ స్టెప్స్ తరువాత మీ ఎమర్జెన్సీ డేటా లోన్ బెనిఫిట్ మీ జియో నంబర్ పైన యాక్టివేట్ చేయబడుతుంది.

ఎన్ని సార్లు మీ ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకోవచ్చు?

మీరు మీ జియో నంబర్ పైన ఈ ఎమర్జెన్సీ డేటా లోన్ ను 5 ఎమర్జెన్సీ డేటా ఫ్యాక్స్ వరకూ తీసుకోవచ్చు. ఒక్కొక్క ప్యాక్ మీకు రూ.11 తో మొత్తం 5 ఫ్యాక్స్ కు గాను 55 రూపాయల వరకూ డేటాని పొందవచ్చు. అదీకూడా వెంటనే పేమెంట్ చేయకుండానే ఈ 5 ఫ్యాక్స్ వరకూ వాడుకోవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :