Jio 5G Plan: శరవేగంగా 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న టెలికం సంస్థగా రిలయన్స్ జియో దూసుకుపోతోంది. అంతేకాదు, వినియోగదారులకు 5G డేటాని ఆనందించే విధంగా కొత్త 5G అన్లిమిటెడ్ డేటా ప్లాన్ ను కూడా అందించింది. జియో కొత్తగా అందించిన రూ.61 ప్లాన్ తో అన్లిమిటెడ్ 5G డేటా అందుకోవచ్చని జియో చెబుతోంది. వాస్తవానికి, మీరు ఉపయోగిస్తున్న 4G సిమ్ కార్డ్ తోనే మీరు 5G సర్వీసులను పొందవచ్చు. అయితే, మీ డేటా లిమిట్ ముగిసిన తరువాత ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా 5G స్పీడ్ తో ఇంటర్నెట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్స్ పైనే 5G సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 5G స్పీడ్ తో డేటాని పొందవచ్చు. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు మరియు ఏ ప్లాన్ లతో పాటుగా ఈ 5G అప్గ్రేడ్ ప్లాన్ వర్తిస్తుందో తెలుసుకోండి.
జియో ప్రకారం, ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కేవలం రూ.61 రూపాయలకే లభిస్తుంది. ఈ పాన్ తో మీకు 6GB అన్లిమిటెడ్ 5G డేటా అందుతుంది. ఈ డేటా ఎటువంటి ఉపయోగానికి లిమిట్ లేదు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ కాలం వరకూ ఈ డేటాని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇది ఏ ప్రాంతాల్లో అయితే
Jio 5G సర్వీస్ అందుబాటులో ఉన్నదో వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇప్పటి వరకూ True Jio 5G లాంచ్ చేయబడిందో, ఆ సిటీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే యాడ్ ఆన్ గా జతచేసే వీలుంది. జియో తెలిపిన ప్రకారం, రూ.119, రూ.149, రూ.179, రూ.199 మరియు రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే ఈ జియో Jio 5G Upgrade Plan యాడ్ ఆన్ గా రీచార్జ్ అవుతుంది.