జియో జబర్దస్త్ అఫర్: రూ.1,999 ధరకే JioPhone Next…ఈజీ EMI అఫర్ కూడా..!
JioPhone Next లాంచ్ కోసం ఎదురుచూస్తున్న వారికీ గుడ్ న్యూస్
జియో తన అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేసింది
కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు
గూగుల్ మరియు రిలయన్స్ జియో భాగస్వాయ్యంతో ప్రకటించిన JioPhone Next లాంచ్ కోసం ఎదురుచూస్తున్న వారికీ గుడ్ న్యూస్. JioPhone Next స్మార్ట్ ఫోన్ గురించి ప్రైస్, ఫీచర్లు మరియు ప్లాన్స్ గురించి అన్ని వివరాలను జియో తన అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఫైనాన్స్ అవసరం లేకుండా కంప్లీట్ పేమెంట్ చెల్లించి కొనుగోలుచేస్తే కేవలం రూ.6,499 రూపాయలకే పొందవచ్చు.
అయితే, నెలవారీ EMI పద్దతిలో ఎంచుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో ఈజీ EMI ద్వారా చెల్లించవచ్చు. అందుకే, ఈ ఫోన్ గురించిన అన్ని వివరాలను గురించి పూర్తిగా తెలుసుకోండి.
JioPhone Next: EMI అఫర్
పైన తెలిపి విధంగా, మీరు పూర్తి అమౌంట్ ను చెల్లిస్తే కేవలం రూ.6,499 ధరకే అందుతుంది. ఒకవేళ ఇన్స్టాల్ మెంట్ (EMI) పద్దతిలో కొనాలనుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించాలి మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చు. దీనికోసం కొన్ని ప్లాన్స్ కూడా అందించింది మరియు ఈ ప్లాన్స్ EMI మరియు రీఛార్జ్ తో బండిల్ చేయబడి ఉన్నాయి. ఆ ప్లాన్స్ ను క్రింద చూడవచ్చు.
1. Always-on plan
ఈ EMI ప్లాన్ లో 18 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.300 మరియు 24 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.350 చెల్లించాలి. ఈ ప్లాన్ తో నెల మొత్తానికి గాను 100 నిమషాల కాలింగ్ మరియు 5GB డేటా లభిస్తుంది.
2. Large Plan
ఈ EMI ప్లాన్ లో 18 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.450 మరియు 24 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.500 చెల్లించాలి. ఈ ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 1.5GB హై స్పీడ్ 4G డేటా లభిస్తుంది.
3. XL Plan
ఈ EMI ప్లాన్ లో 18 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.500 మరియు 24 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.550 చెల్లించాలి. ఈ ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB హై స్పీడ్ 4G డేటా లభిస్తుంది.
4. XXL Plan
ఈ EMI ప్లాన్ లో 18 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.550 మరియు 24 నెలల EMI ఎంచుకుంటే నెలకు రూ.600 చెల్లించాలి. ఈ ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2.5GB హై స్పీడ్ 4G డేటా లభిస్తుంది.
ప్రోసెసింగ్ ఫీజ్ క్రింద రూ.501 రూపాయలు కూడా అధనంగా చెల్లించవలసి ఉంటుంది.
JioPhone Next: స్పెక్స్
ఇక JioPhone Next ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ 5.45-అంగుళాల HD(720×1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు.
ఈ ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ కెమెరా HDR Mode, Night Mode, Portrait వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది.