రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కంప్లీట్ ప్యాకేజ్ తో బెస్ట్ ప్లాన్ ను తక్కువ ధరలోనే ప్రకటించింది. ఈ నెల ప్రారంభం నుండి జియో యొక్క అన్ని రీఛార్జ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఈ దీన్ని దృష్టిలో ఉంచుకొని జియో డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో సహా అన్ని ప్రయోజాలతో అందించింది.
వాస్తవానికి, వోడాఫోన్ ఐడియా తక్కువ ధర ప్లాన్ లలో SMS సౌకర్యాన్ని అందించడం లేదని కొద్ది రోజుల క్రితం జియో నేరుగా TRAIకి ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగానే ఇతర టెలికం కంపెనీల పైన మరింత భారాన్ని పెంచేలా తన రూ.119 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ లో 300 ఉచిత SMS సౌకర్యాన్ని కూడా జతచేసింది. ఇక ఈ మూడు కంపెనీల అఫర్ చేస్తున్న చవక అన్లిమిటెడ్ ప్లాన్స్ ను ఈ క్రింద చూడవచ్చు.
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 21 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
SMS తో జతగా వచ్చే Vi యొక్క చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.179 ధరలో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 2 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అలాగే, Vi Movies & TV బేసిక్ సభ్యత్వం అందుబాటులో ఉంది.
SMS సర్వీస్ తో వచ్చే ఎయిర్టెల్ చవకైన ప్లాన్ రూ.155 రూపాయలలో వస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 1 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ Prime Video ఉచిత ట్రయిల్, ఫ్రీ hello Tunes మరియు Wink Music కి ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.