Jio Unlimited Plans: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు OTT యాక్సెస్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోంది. అందులోనూ, Prime Video మరియు Zee5-SonyLIV కాంబో తో తీసుకు వచ్చిన కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ మరింత ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ గా చెప్పబడుతున్నాయి. అందుకే, ఈరోజు రిలయన్స్ అందిస్తున్న ఈ బెస్ట్ అన్లిమిటెడ్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను గురించి తెలుసుకుందామా.
రిలియన్స్ జియో రూ. 3,227 ప్లాన్ పూర్తిగా 1 ఇయర్ అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. అంటే, 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా (4G డేటా 2GB/day) మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 1 ఇయర్ Prime Video సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ ప్లాన్ తో పూర్తిగా 1 ఇయర్ అన్లిమిటెడ్ లాభాలు మరియు OTT ప్రయోజనం పొందవచ్చు.
ఇక జియో అందిస్తున్న Zee5-SonyLIV కాంబో ప్లాన్స్ విషయానికి వస్తే, జియో ఈ కేటగిరిలో రూ. 909 మరియు రూ. 3,662 రెండు ప్లాన్ లను అందిస్తోంది. ఈ ప్లాన్స్ అందిస్తున్న పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
Also Read : Sony Smart Tv ల పైన 3 Years వారెంటీ మరియు భారీ డీల్స్ ప్రకటించిన Amazon.!
రిలయన్స్ జియో రూ. 909 ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా (4G డేటా 2GB/day) మరియు డైలీ 100SMS లిమిటెడ్ తో 84 రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV మరియు ZEE5 రెండు OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. మూడు నెలల అన్లిమిటెడ్ లాభాలను OTT సబ్ స్క్రిప్షన్ తో కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
రిలయన్స్ జియో యొక్క రూ. 3,662 ప్లాన్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా (4G డేటా 2.5 GB/day) మరియు డైలీ 100SMS లిమిటెడ్ తో 365 రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV మరియు ZEE5 రెండు OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. పూర్తి సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలను OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైనది.
Also Read : Amazon పండుగ Sale నుండి Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!