రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన రూ.123 రూపాయల ప్లాన్ తో గోప్ప ప్రయోజనాలను అందిస్తోంది. తక్కువ ధరలో నెలంతా కాలింగ్ మరియు డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఇటీవల JioBharat ఫీచర్ ఫోన్ ను ప్రకటించిన రిలయన్స్ జియో ఈ ఫోన్ కోసం ఈ కొత్త ప్లాన్ ను కూడా అందించింది. రిలయన్స్ జియో యొక్క రూ. 123 ప్లాన్ తో యూజర్లు అందుకునే పూర్తి ప్రయోజనాలను తెలుసుకోండి.
రిలయన్స్ జియో Jio Bharat ఫోన్ యూజర్ల కోసం అందించిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రిలయన్స్ యొక్క ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం యూజర్లకు అందుతుంది. అంతేకాదు, ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గానే 14GB హై స్పీడ్ 4G ఇంటర్నెట్ కూడా లభిస్తుంది.
ఒకవేళ జియో ఫీచర్ ఫోన్ యూజ్ చేస్తూ మరింత తక్కువ ధరలో లభించే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, రూ.91 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ వుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలనుఇక్కడ చూడవచ్చు.
రిలయన్స్ జియో యొక్క ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న వారి కోసం అతి తక్కువ ధరలో జియో అందించిన ప్లాన్ ఈ రూ. 91 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ . ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందుతుంది మరియు టోటల్ 3 GB (రోజుకు 100 MB + 200 MB అదనపు డేటా) ప్రయోజనం కూడా అంధిస్తుంది. ఈ సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి 50 SMS ప్రయోజనం మరియు JioTV, JioCinema మరియు JioCloud లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
జియోఫోన్ వాడుతున్న వారు పూర్తిగా సంవత్సరం అన్లిమిటెడ్ కాలింగ్ కాలింగ్ మరియు డేటా కోరుకుంటే కూడా రూ. 895 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో వుంది. ఈ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
జియో రూ.895 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో పూర్తిగా 336 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందుతుంది. అంతేకాదు, నెలకు 2GB చొప్పున 12 నెలల పాటు ఈ డేటాని అందిస్తుంది రిలయన్స్ జియో. అలాగే, నెలకు 50 SMS ల చొప్పున 12 నెలలకు లభిస్తుంది.