జియో జబర్దస్త్ అఫర్: ఈ రీఛార్జ్ చెయ్యండి..ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!
ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను అఫర్ జియో జబర్దస్త్ అఫర్
ఉచిత OTT అఫర్ ను Jio కేవలం కొన్ని ప్లాన్ లకు మాత్రమే పరిమితం చేసింది
ఈ ప్లాన్ లతో ప్రీమియం OTT సబ్ స్క్రిప్షన్ అందుతుంది
జియో జబర్దస్త్ అఫర్: ఈ రీఛార్జ్ చెయ్యండి ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ అందుకోవచ్చు. గతంలో, జియో తన అనేక ప్లాన్స్ తో ఈ ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను అఫర్ చేసేది. కానీ, 5G లాంచ్ తరువాత కంపెనీ ఈ ఉచిత OTT అఫర్ ను కేవలం కొన్ని ప్లాన్ లకు మాత్రమే పరిమితం చేసింది. ఇది మాత్రమే కాదు, కొన్ని జనరంజక ప్రీపెయిడ్ ప్లాన్ లను పూర్తిగా తలగించడమే కాకుండా మరి కొన్నింటిని సవరించింది. అయితే, ఇప్పటికి కూడా ఒక రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ లతో మాత్రం ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ కస్టమర్లకు అందిస్తోంది. ఆ రెండు ప్లాన్స్ మరియు ఆ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈరోజు తెలుసుకుందాం.
Jio Rs.1,499 Plan
జియో అఫర్ చేస్తున్న ప్లాన్ లలో ఈ Rs.1,499 రీఛార్జ్ ప్లాన్ ని బెస్ట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటాని కూడా మీకు అందిస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
ఇప్పటి వరకు పైన చెప్పిన ప్రయోజనాలన్నిఒక ఎత్తయితే మరొక అదనపు ప్రయోజనం మిమల్ని మరింత ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం మీరు పొందుతారు. అంటే, మీకు 85 రోజుల జియో రీఛార్జ్ ప్రయోజనాలన్నీ కూడా ఉచితంగా అఫర్ చేస్తున్నట్లే. అయితే, Disney+ Hotstar Premium సబ్ స్క్రిప్షన్ ముందు నుండే కలిగి ఉన్న వారికి ఇది నప్పదు.
Jio Rs.4,199 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here