రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అన్ని బడ్జెట్ లలో మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ అఫర్ చేస్తోంది. వీటిలో, అధిక ప్రయోజనాలతో పాటుగా దీర్ఘకాలిక వ్యాలిడిటీని అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మనం జియో కస్టమర్లకు జియో అఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ మరియు అవి అందించే ప్రయోజనాలను గురించి చూడనున్నాము.
రిలయన్స్ జియో 2023 కొత్త సంవత్సర అఫర్ లో భాగంగా విడుదల చేసిన కొత్త రూ.2023 రూపాయల ప్లాన్ మరియు రూ.2,999 రూపాయల వన్ ఇయర్ ప్లాన్ లో మంచి లాభాలను అందించే ప్లాన్స్ గా చెప్పవచ్చు. ఈ రెండు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ అందించే లాభాలను ఇక్కడ చూడవచ్చు.
జియో కొత్త రూ.2,023 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
అంతేకాదు, అర్హత కలిగిన వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటాని కూడా ఈ ప్లాన్ లతో అందించనున్నట్లు కూడా తెలిపింది.
మరిన్ని జియో బెస్ట్ ఆఫర్ల కోసం Click Here