రిలయన్స్ జియో ఎప్పటిలాగానే అన్లిమిటెడ్ లాభాలను అందించే టెలికం కంపెనీగా అవతరించింది. 4G నెట్ వర్క్ లాంచ్ సమయంలో అందించిన ఉచిత అన్లిమిటెడ్ డేటా ఇప్పుడు 5G నెట్ వర్క్ లాంచ్ తో కూడా అందించింది. అంతేకాదు, ఇప్పటికే దేశంలోని 2,691 ప్రధాన మరియు ఉప నగరాలలో 5G నెట్ వర్క్ ను విస్తరించిన జియో, ఈ నగరాలలోని ఎలిజిబుల్ యూజర్లకు అన్లిమిటెడ్ 5G డేటాని ఉచితంగా అందిస్తోంది. మరి అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ అఫర్ వంటి అధిక లాభాలను అందించే ప్లాన్ లలో బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.
జియో 5G నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాలలోని ఎలిజిబుల్ యూజర్లకు మాత్రమే ఈ అన్లిమిటెడ్ 5G డేటా ను ఉపయోగించుకుని అవకాశం ఉందని గుర్తుంచుకోండి. దీని కోసం మీ వద్ద 5G మొబైల్ మరియు జియో 5G అన్లిమిటెడ్ డేటాని అఫర్ చేసే ప్లాన్ రీఛార్జ్ కూడా చేయాల్సి ఉంటుంది.
రూ.239 రూపాయల ప్లాన్ మొదలుకొని ఆ పైన లభించే అన్ని జియో ప్లాన్స్ తో మీరు ఈ అన్లిమిటెడ్ 5G డేటా లాభాన్ని పొందవచ్చు. అయితే, ఇందులో మీకు బడ్జెట్ ధరలో అధిక లాభాలను అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి మరియు వాటిని గురించి ఇప్పుడు చూద్దాం.
జియో యొక్క రూ.259 ప్లాన్ బడ్జెట్ ధరలో సరైన ప్లాన్ గా చెప్పబడుతుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో మీకు ఒక నెల క్యాలండర్ రోజుల వ్యాలిడిటీ అందుతుంది. అంటే, ఆ నెలను బట్టి 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీ మీకు లభిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు డైలీ 1.5GB 4G డేటా లభిస్తుంది. ఒకవేళ మీరు Jio True 5G ఎలిజిబుల్ కస్టమర్ అయితే, మీరు అన్లిమిటెడ్ 5G డేటా వినియోగ ఆనందాన్ని పొందవచ్చు. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS మరియు అన్ని జియో యాప్స్ కి యాక్సెస్ పొందవచ్చు.
ఈ ప్లాన్ జియో యొక్క బెస్ట్ బడ్జెట్ మరియు ట్రేండింగ్ లాంగ్ వ్యాలిడిటీ గా చెప్పబడుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.5GB డేటా మరియు డైలీ 100 SMS వంటి ప్రయోజనాలు 84 రోజుల చెల్లుబాటుతో అందుతాయి. అలాగే, మీరు Jio True 5G అర్హత కలిగిన యూజర్ అయితే మీకు ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం అందుతుంది.
ఈ ప్లాన్ జియో అఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ మరియు ఇది ఈ ప్లాన్ తో అదనపు ఉచిత వ్యాలిడిటీ, డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఈ ప్లాన్ మీకు టోటల్ 388 రోజుల వ్యాలిడిటీ, 987.5GB ల 4G డేటా, రోజువారీ 100 SMS వంటి లాభాలతో పాటుగా 5G ఎలిజిబుల్ యూజర్లకు అన్లిమిటెడ్ 5G డేటా లాభాన్ని కూడా అఫర్ చేస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here