జియో అఫర్: Netflix మరియు Amazon ఉచిత సబ్ స్క్రిప్షన్ అఫర్ చేసే ప్లాన్స్.!

జియో అఫర్: Netflix మరియు Amazon ఉచిత సబ్ స్క్రిప్షన్ అఫర్ చేసే ప్లాన్స్.!

Amazon మరియు Netflix ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే, జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్స్ పైన ఒక లుక్కేయండి. అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు OTT సబ్ స్క్రిప్షన్ వంటి ఇతర లాభాలను కూడా ఈ జియో ప్లాన్స్ తో అందుకోవచ్చు. అయితే, ఈ అవకాశం ప్రీపెయిడ్ కస్టమర్ల అందుబాటులో లేదు. ఈ సర్వీస్ ను కేవలం పోస్ట్ పైడ్ ప్లాన్ లలో మాత్రమే అఫర్ చేస్తోంది. జియో యొక్క పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు ప్రైమ్ వీడియో మరియు నెట్ ఫ్లిక్స్ OTT లలో కంటెంట్ ను ఉచితంగా చూడవచ్చు. మరి జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.

జియో అఫర్ చేస్తున్న ఈ ప్లాన్స్ పోస్ట్ పైడ్ ప్లాన్స్ మరియు ప్రయోజనాలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తించవు.ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుండి ప్రారంభమవుతాయి మరియు ఇది వీటిలో బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix మరియు Amazon Prime Video లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.

ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది. 

Note: పైన తెలిపిన అన్ని ప్లాన్ ధరలకు 18% GST ని కూడా కలుపుకోవలసి వుంటుంది. అంటే, Rs.399+18%GST, Rs.599+18%GST మరియుబ్ Rs.799+18%GST ఈ ప్లాన్ ధరగా గుర్తుంచుకోండి.      

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo