Jio: ప్రతిరోజూ 2.5 డేటాతో సహా మరిన్ని ప్రయోజనాలు అందించే టాప్ ప్లాన్స్.!

Updated on 27-Feb-2023
HIGHLIGHTS

ప్రతిరోజూ 2.5 డేటాతో సహా మరిన్ని ప్రయోజనాలు అందించే టాప్ ప్లాన్స్

నాలుగు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి

డైలీ అధిక డేటా కోరుకునే వారికి తగిన ప్లాన్స్

Jio: ప్రతిరోజూ 2.5 డేటాతో సహా మరిన్ని ప్రయోజనాలు అందించే టాప్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ కేటగిరిలో నాలుగు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను నెలవారీ బడ్జెట్ రేటు మొదలుకొని  సంవత్సర వ్యాలిడిటీ వరకూ కస్టమర్లకు అన్ని ప్రయోజనాలతో జియో అఫర్ చేస్తోంది. మరి జియో అఫర్ చేస్తున్న ప్రయోజనాలను అందిస్తున్న ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా. 

Jio Rs.349 Plan

జియో కొత్తగా  ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 12GB అదనపు ఉచిత డేటాని కూడా పొందుతారు. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.                

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 12GB అదనపు ఉచిత డేటాని కూడా పొందుతారు. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.

Jio Rs.2,023 Plan

జియో కొత్త రూ.2,023  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Jio Rs.2,999 Plan

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :