Jio జబర్దస్త్ ఆఫర్: రూ. 148 రూపాయలకే 12 OTT సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్ లాంచ్.!
రిలయన్స్ Jio కొత్త ప్లాన్ ను తన వినియోగదారుల కోసం అనౌన్స్ చేసింది
ఈ ప్లాన్ తో 12 OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా హై స్పీడ్ డేటాని కూడా అందిస్తోంది
ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందిస్తుంది
రిలయన్స్ Jio కొత్త ప్లాన్ ను తన వినియోగదారుల కోసం అనౌన్స్ చేసింది. ఆన్లైన్ లో కంటెంట్ ను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్న వారికి ఈ కొత్త ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన ఈ ప్లాన్ తో 12 OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా హై స్పీడ్ డేటాని కూడా అందిస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో పాటుగా తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే మరో రెండు ప్లాన్ లు కూడా ఉన్నాయి.
రిలయన్స్ జియో రీసెంట్ గా OTT సబ్ స్క్రిప్షన్ లతో ప్రకటించిన JioTV PREMIUM Plans నుండి వచ్చిన కొత్త బడ్జెట్ ప్లాన్ రూ. 148 ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
Jio రూ. 148 ప్లాన్
రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 28 రోజుల JioCinema Premium షబ్ స్క్రిప్షన్ అందుతుంది మరియు ఈ కూపన్ MyJio అకౌంట్ లో క్రెడిట్ చేయబడుతుంది. దీనితో, జియో టీవీ యాప్ ద్వారా Liongate Play, Discovery+, Sun NXT, Sony LIV, ZEE5, JioCinema Premium, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi యాప్ లకు ఉచిత షబ్ స్క్రిప్షన్ అందుతుంది.
ఈ ప్లాన్ తో పూర్తిగా 28 రోజుల కాలానికి గాను 10 GB ల హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంటే, కేవలం 148 రూపాయలకే ఈ ప్లాన్ ద్వారా ప్రీమియం OTT యాప్స్ సబ్ స్క్రిప్షన్ తో పాటు డేటాని కూడా పొందవచ్చు.
అయితే, మీకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా కావాలనుకుంటే జియో యొక్క రూ. 398 ప్లాన్ ను చూడవచ్చు.
Also Read : Gold Rate Live: మార్కెట్ లో 63 వేల మార్క్ టచ్ చేసిన గోల్డ్ రేట్.!
జియో రూ. 398 ప్లాన్
ఈ ప్లాన్ పైన తెలిపిన 12 OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని, 4G నెట్ వర్క్ పైన డైలీ 2 GB డేటాని అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో 100 SMS/day సౌలభ్యం కూడా అందుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు ఆల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది.