రిలయన్స్ జియో అంటే తెలియని వారుండరు, ఎందుకంటే టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే అంచనాలకు అందని ప్రణాళికలతో, ఫ్రీ సర్విసులతో అందరి మనసుదోచుకుంది. వాస్తవానికి, జియో వచ్చిన తరువాతనే చాలావరకూ మొబైల్ డేటా మరియు కాలింగ్ కి సంబంధించిన అన్ని కంపెనీల ప్లాన్స్ యొక్క ధరలలో గణనీయమైన మార్పులు జరిగాయి. అంతేకాదు, ఇప్పటికి కూడా అతితక్కువ ధరకే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్న టెలికం సంస్థగా జియో పేరునే చెప్పొచ్చు.
జియో మార్కెట్లోకి ప్రవేశించి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. ఈ టెలికం సంస్థ గత నెల 2 వ తేదీ వరకు 30 కోట్ల యాక్టివ్ సబ్ స్క్రైబర్స్ ను కలిగివున్నట్లు ప్రకటించింది. అంటే, కేవలం 30 నెలల్లోనే 30 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ మార్కును చేరుకుంది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే అని చెప్పొచ్చు. మొదట నుండి జియో అందిస్తున్న నాణ్యమైన 4G సర్వీసులు మరియు అతితక్కువ ధరలో అందించిన రీఛార్జ్ ప్లాన్స్ అన్ని కలగలుపుకుని, జియో అత్యంత వేగంగా విస్తరించడానికి దోహదం చేశాయి.
ఇక ఇతర ప్రధాన టెలికం సంస్థలైనటువంటి భారతి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా లతో పోల్చి చూస్తే, భారతి ఎయిర్టెల్ 340 మిలియన్ల సబ్ స్క్రైబర్లను కలిగివుంది, ఆంట్ దాదాపుగా జియో భారతి ఎయిర్టెల్ దగ్గరకు చేరుకుంది. అలాగే, ఇటీవల వోడాఫోన్ మరియు ఐడియా కలిసి మిళితముగా ఏర్పడిన వోడాఫోన్ ఐడియా 400 మిలియన్ల సబ్ స్క్రైబర్లను కలిగివుంది.