జీయో తన పోటీదారుల కంటే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మరియు ఎక్కువ డేటాను అందించడంలో ఎప్పుడు ముందంజలో ఉంటుంది . ముకేష్ అంబానీ నేతృత్వంలోని, ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పుడు అన్ని సర్వీసులను ఒకేదగ్గర అందించే ఉదేశ్యంతో, 100 సర్వీసులను అందించే, ఒక కొత్త "సూపర్ అప్లికేషన్" ను సిద్ధం చేస్తోంది. Jio సిద్ధంచేస్తున్నఈ సూపర్ ఆప్ ఇ-కామర్స్, ఆన్లైన్ బుకింగ్స్, మరియు పెమెంట్స్ , వంటి అనేక విషయాలను ఒకే చోట అందిస్తుంది.
ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్న అనేకరకాల అప్లికేషన్లను కలిగి జియో, ఇటువంటి ఒక ఆప్ సిద్ధం చేస్తుందనడంలో, ఎటువని సందేహం లేదనిపిస్తోంది. భారతదేశంలో, ఇప్పటికే అందరూ ఆన్లైన్ వ్యాపారాలకు మరియు చెల్లింపులకు అలవాటుపడిపోయారు మరియు అనేక ఆన్లైన్ ప్లాట్ఫారలు కూడా దాదాపుగా ఇండియాను టార్గెట్ చేసుకునే వారై ప్రాణనాలికలను సిద్ధం చేస్తున్నాయి కాబట్టి, ఈ సమయంలో జియో సూపర్ ఆప్ గనుక తీసుకువస్తే, తన వినియోగదారులను ఈ వైపుగా తిప్పుకోవచ్చు.
అప్లికేషన్ డెవలపర్లు ఆప్ లను అభివృద్ధి చేయడానికి టెక్ స్టాక్ను ఉపయోగిస్తాయి, ఇది ఫ్రేంవర్క్స్, టూల్స్ మరియు ప్రోగ్రామింగ్ భాషల కలయికగా ఉంటుంది. రిలయన్స్ జీయో చేత ఉపయోగించబడిన టెక్ స్టాక్ ఒక సంభాషణాత్మక కృత్రిమ మేధస్సు (AI) లేయర్, లాజిస్టిక్స్ లేయర్, లోకల్ వాయిస్ టెక్ లేయర్, మరియు AI ఆధారిత ఎడ్యుకేషన్ లేయరును కలిగి ఉంటుంది. ఈ లేయర్ల సహాయంతో, జియో పరికరాల పైన పెట్టినప్పుడు, WeChat వంటి ఒక ఎకో సిస్టం భారత్ సృష్టించుకోవచ్చని, రామ్ చెప్పారు. రిలయన్స్ రిటైల్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ త్వరలోనే ప్రారంభించనుంది. ఇది ప్రస్తుతం అంతర్గత పరీక్షలో ఉందని మరియు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పెటియం మరియు మరికొన్ని ఇటువంటి ఆన్లైన్ రిటైలర్లపై తీవ్రప్రభావం చూపుతుంది.