భారతదేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ అందిస్తున్న టెలికం సంస్థగా, జియో మళ్ళి టాప్ ప్లేస్ లో నిలిచింది. రిలయన్స్ జియో 19.3 Mbps డౌన్ లోడ్ వేగంతో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు TRAI అందించిన వివరాల ద్వారా తెలిపింది. ఇక అప్ లోడ్ విషయానికి వస్తే, 7.9 Mbps అప్ లోడ్ స్పీడ్ తో వోడాఫోన్ (Vi) టాప్ ప్లేస్ లో నిలిచింది.
సెప్టెంబర్ నెలకు గాను TRAI అక్టోబర్ లో అందించిన టెలికం మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లిస్టింగ్ ప్రకారం, జూన్, జూలై మరియు ఆగస్టు నెలలతో పోలిస్తే సెప్టెంబర్ నెలల్లో అన్ని ప్రధాన టెలికం సంస్థల మొబైల్ ఇంటర్నెట్ వేగంలో పెరుగుదల నమోదు చేశాయి. వీటిలో, రిలయన్స్ జియో సెప్టెంబర్ నెలలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో 21 శాతం పెరుగుదలను అందుకొని మొత్తంగా 19.3 Mbps వేగంతో ఈ లిస్టింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఇక రెండవ స్థానం విషయానికి వస్తే, ఎయిర్టెల్ 7.5 Mbps వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. ఎయిర్టెల్ కూడా గత నెలలతో పోలిస్తే 3 వరకూ పెరిగింది. అయితే, అప్ లోడ్ విషయానికి వస్తే మాత్రం వోడాఫోన్ (వోడాఫోన్ ఐడియా ) 6.5 Mbps అప్లోడ్ వేగంతో మొదటి స్థానములో నిలిచింది. అప్లోడ్ వేగంలో జియో మరియు ఎయిర్టెల్ 3.5 Mbps స్పీడ్ తో తరువాతి స్థానాల్లో నిలిచాయి.