Jio Hero 5G: జూలై 3 నుంచి పెరిగిన టారిఫ్ రేట్లు అందరికీ మింగుడు పడని విషయంగా మారింది. రేట్లు పెరిగిన తరువాత అందుబాటులోకి వచ్చిన కొత్త ప్లాన్ రేట్లు దెబ్బకి యూజర్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా బాహాటంగానే మాట్లాడుతున్నారు. అందుకే, కాబోలు యూజర్ల అలక తీర్చేందుకు రిలయన్స్ జియో కొత్త ప్లాన్ లను తీసుకు వచ్చింది. అధిక వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలతో ఈ కొత్త ప్లాన్ లాంచ్ చేసింది.
ఇటీవల రూ. 349 ప్లాన్ ను అధిక వ్యాలిడిటీ తో రివైజ్ చేసిన జియో ఇప్పుడు ఇదే దారిలో పాత రూ. 899 ప్లాన్ ను కూడా రివైజ్ చేసినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, Jio Hero 5G పేరుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను పరిచయం చేసింది. ఇందులో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ ను 90 రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలతో అందించింది. అయితే, ముందుగా ఇదే అందించిన రూ. 899 ప్లాన్ మరియు కొత్తగా అందించిన రూ. 899 ప్లాన్ లో కొంచెం వ్యత్యాసం వుంది.
Also Read: Poco F6 Limited Edition: పోకో పవర్ ఫుల్ మిడ్ రేంజ్ ఫోన్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ వస్తోంది.!
జియో హీరో 5జి రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 90 రోజుల పాటు డైలీ 2GB డేటా చొప్పున 180GB 4జి డేటా + 20GB ఎక్స్ట్రా డేటా కలిపి టోటల్ 200GB డేటా అందిస్తుంది. అంతేకాదు, 5జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
అలాగే, ఈ ప్లాన్ తో జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది. బడ్జెట్ ధరలో 3 నెలల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా కోరుకునే జియో యూజర్లు ఈ జియో హీరో 5జి రూ. 899 ను పరిశీలించవచ్చు.
మొబైల్ రీఛార్జ్ మరియు కొత్త ప్లాన్ చెక్ చేయడానికి Click Here