Jio Free Recharge పేరుతో వాట్సాప్ లో కొత్త స్కామ్ మొదలు పెట్టిన స్కామర్లు.!
Jio Free Recharge పేరుతో వాట్సాప్ లో కొత్త స్కామ్ మొదలు పెట్టారు స్కామర్లు.
అనంత్ అంబానీ పెళ్ళి కానుకగా దేశంలో ఉన్న జియో యూజర్లకు ఉచిత రీఛార్జ్ ఆఫర్ పేరుతో వైరల్ మెసేజ్
ఈ కొత్త వైరల్ స్కామ్ మెసేజ్ గురించి వివరంగా తెలుసుకోండి
Jio Free Recharge పేరుతో వాట్సాప్ లో కొత్త స్కామ్ మొదలు పెట్టారు స్కామర్లు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచిత రీఛార్జ్ ని ప్రకటించారని ఈ కొత్త మెసేజ్ తో స్కామర్లు నమ్మబలుకుతున్నారు. ఈ ఉచిత రీఛార్జ్ నేరుగా మొబైల్ నెంబర్ పైన వర్తింప చేయాలంటే మెసేజ్ లో అందించిన లింక్ పైన క్లిక్ చేయాలి అని మెసేజ్ చెబుతుంది. ఖర్మ కాలి ఈ మెసేజ్ పైన క్లిక్ చేశారంటే ఇక అంతే సంగతులు. ఈ కొత్త వైరల్ స్కామ్ మెసేజ్ గురించి వివరంగా తెలుసుకోండి.
Jio Free Recharge పేరుతో స్కామ్ మెసేజ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్ళి కానుకగా దేశంలో ఉన్న జియో యూజర్లకు ఉచిత రీఛార్జ్ ఆఫర్ ఇస్తున్నారని ఒక మెసేజ్ వాట్సాప్ లో శరవేగంగా తిరుగుతోంది. ఈ మెసేజ్ లో అందించిన లింక్ పైన క్లిక్ చేసి ఈ రీఛార్జ్ ను అందుకోండి అని మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ను నమ్మి లింక్ పైన క్లిక్ చేసారంటే, మీ అకౌంట్ లను ఖాళీ చేస్తారు స్కామర్లు.
వాస్తవానికి, ఇటువంటి ఏ విధమైన ఉచిత ఆఫర్ ను జియో ప్రకటించలేదు. ఇది కేవలం మీ అత్యాశను క్యాష్ చేసుకోవడానికి స్కామర్లు కొత్తగా వేస్తున్న ఎర మాత్రమే అని తెలుసుకోండి. ఎప్పటి కప్పుడు కొత్త దారుల్లో స్కామర్లు తెగబడుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశమైన అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ వివాహం పేరుతో ఈ కొత్త స్కామ్ కు తెర లేపారు.
Also Read: Amazon Prime Day Sale బిగ్ డీల్ రివీల్: వన్ ప్లస్ 12R తో బడ్స్ 3 ఉచితం అంట.!
వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసుకొని పంపుతున్న ఈ మెసేజ్ లో రూ. 799 రూపాయల విలువైన మూడు నెలల జియో ప్రీపెయిడ్ ప్లాన్ ను అనంత్ అంబానీ పెళ్లి కానుకగా ఉచితంగా పొందండి అని ఉంటుంది. అంతేకాదు, ఈ మెసేజ్ నిజమే అనిపించేలా చేయడానికి ఫోటోలు మరియు లోగోలు సైతం యాడ్ చేసినట్లు ఈ మెసేజ్ అందుకున్న వారు చెబుతున్నారు. ఇందులో స్కామర్లు ముందే ఫీడ్ చేసిన స్కామ్ లింక్స్ ఉంటాయి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ డేటా మరియు ఇతర వివరాలు స్కామర్లు అందుకుంటారు.
ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తెలుసుకోండి. ఇటువంటి ప్రలోభాలకు లొంగి పోయారంటే మీ ఇల్లు గుల్ల అవుతుంది.